Diwali Movies : దీపావళికి టాలీవుడ్ లో పేలబోతున్న టపాసులు ఇవే.

దసరా సీజన్ ముగిసింది. దీపావళి హంగామా షురూ అయింది. లాస్ట్ వీక్ కొన్ని చిన్న సినిమాలు రిలీజవగా ఈ వీక్ దీపావళికి ముందుగానే మరికొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి............

Diwali Movies : దీపావళికి టాలీవుడ్ లో పేలబోతున్న టపాసులు ఇవే.

Diwali Movies in Tollywood

Diwali Movies :  దసరా సీజన్ ముగిసింది. దీపావళి హంగామా షురూ అయింది. లాస్ట్ వీక్ కొన్ని చిన్న సినిమాలు రిలీజవగా ఈ వీక్ దీపావళికి ముందుగానే మరికొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి.

మంచు విష్ణు హీరోగా, పాయల్ రాజ్ పుత్, సన్నిలియోన్ ప్రధాన పాత్రల్లో ఇషాన్ సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ‘జిన్నా’. సునీల్, రఘుబాబు, నరేశ్, సురేశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 21న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఇప్పటికే టీజర్ తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మంచు విష్ణు సినిమా రానుండటం, సన్నీ లియోన్ నటించడం, ప్రమోషన్స్ కూడా వీర లెవల్లో ఉండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.

యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జోడీగా అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో రూపొందిన సోషియో ఫాంటసీ మూవీ ‘ఓరి దేవుడా’. విక్టరీ వెంకటేశ్ మోడ్రన్ దేవుడిగా ఎంటర్ టైన్ చేయబోతున్న ఈ మూవీ తమిళ సూపర్ హిట్ ‘ఓ మై కడవుళే’ కు అఫీషియల్ రీమేక్ అని తెలిసిందే. డిఫ్ఫరెంట్ జోనర్స్ తో అలరిస్తున్న విశ్వక్ ఓరి దేవుడా సినిమాతో ఈ నెల 21న థియేటర్స్ కి రానున్నాడు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

తమిళ హీరో కార్తి డ్యూయల్ రోల్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. మిత్రన్ దీనికి డైరెక్టర్. కార్తి తండ్రీకొడుకులుగా డిఫెరెంట్ గెటప్స్ తో అదరగొట్టబోతున్న ఈ సినిమాలో రజిషా విజయన్, రాశీ ఖన్నా హీరోయిన్స్. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే విలన్ గా నటిస్తున్నాడు. లైలా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమాతో తెర మీదకు రానుంది. ఈ సినిమా కూడా ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోతోంది. కార్తీకి ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉండటంతో టాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

తమిళ హీరో శివకార్తికేయన్ డైరెక్ట్ గా తెలుగులో నటిస్తు్న్న ఫస్ట్ మూవీ ‘ప్రిన్స్’. ఈ మూవీతో మరియా ర్యాబోషెప్కా అనే ఉక్రెయిన్ బ్యూటీ హీరోయిన్ గా ఇక్కడ ఎంట్రీ ఇస్తోంది. తమిళ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో శివకార్తికేయన్ స్కూల్ టీచర్ గా నటిస్తున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవీ డైరెక్ట్ చేస్తున్న ఈ తెలుగు, తమిళ బైలింగ్విల్ మూవీ ఈ నెల 21న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయబోతోంది.

Nagarjuna : స్టార్ హీరోల తమ్ముళ్లు అనే ఇమేజ్.. అది వదిలేసి.. నాకు తెలిసి అలాంటి హీరోలు ముగ్గురే ఉన్నారు..

అలాగే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, నుష్రత్ బరుచా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మన సత్యదేవ్ నటించిన రామ్ సేతు సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా టాలీవుడ్ లో కూడా రిలీజ్ కానుంది. శ్రీలంక, భారత దేశం మధ్య రాముడు కట్టిన రామ్ సేతు ఆధారంగా ఈ సినిమా తీసినట్టు సమాచారం.