DJ Tillu 2: సీక్వెల్ రిలీజ్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన డీజే టిల్లు!

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ‘అట్లుంటది మనతోని’ అనే టైపులో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు ఈ యంగ్ హీరో. ఇక తాజాగా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌ ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు.

DJ Tillu 2: సీక్వెల్ రిలీజ్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన డీజే టిల్లు!

DJ Tillu 2 Movie Release Update

DJ Tillu 2: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ‘అట్లుంటది మనతోని’ అనే టైపులో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు ఈ యంగ్ హీరో. ఇక తాజాగా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌ ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నాడు ఈ హీరో. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాతో మరోసారి డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

DJ Tillu 2 : టిల్లు స్క్వేర్ నుంచి అనుపమ అవుట్?

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత అనుపమ పరమేశ్వరన్‌ను సెలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అయితే తాజాగా, ఈ సినిమా నుండి అమ్మడు వాకౌట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై మాత్రం ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు. అయితే, అనుపమ స్థానంలో మరో బ్యూటీ మడోనా సెబాస్టియన్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి హీరో ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, మార్చి నెలలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తున్నట్లుగా సిద్ధూ పేర్కొన్నాడు.

DJ Tillu: ముచ్చటగా ముగ్గురుని మార్చిన డీజే టిల్లు.. ఎటు వెళ్తుందో?

త్వరలోనే ఓ అదిరిపోయ్ అప్డేట్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తామని సిద్ధు ఈ సందర్భంగా తెలిపాడు. ఏదేమైనా డీజే టిల్లు సీక్వెల్ మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా ఈ సినిమా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తోంది. మరి నిజంగానే డీజే టిల్లు సీక్వెల్ చిత్రాన్ని మార్చిలో రిలీజ్ చేస్తారా అనే విషయం తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.