DJ Tillu: భీమ్లా నాయక్ మేకర్స్ నుండి సంక్రాంతి బరిలో ‘డీజే టిల్లు’!

ఆర్ఆర్ఆర్ కోసం భీమ్లా నాయక్ ను వాయిదా వేశారు. అయితే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా మారిన పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. మన దగ్గర ఇంకా థియేటర్స్ మీద ఇంకా ఆంక్షలు విధించకపోగా..

DJ Tillu: భీమ్లా నాయక్ మేకర్స్ నుండి సంక్రాంతి బరిలో ‘డీజే టిల్లు’!

Dj Tillu

DJ Tillu: ఆర్ఆర్ఆర్ కోసం భీమ్లా నాయక్ ను వాయిదా వేశారు. అయితే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా మారిన పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. మన దగ్గర ఇంకా థియేటర్స్ మీద ఇంకా ఆంక్షలు విధించకపోగా చాలా రాష్ట్రాలలో ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాకి అది ఇబ్బందిగా మారింది. అయితే.. భీమ్లా నాయక్ కు అది అడ్డంకి కాకపోవడంతో మళ్ళీ భీమ్లా నాయక్ ను సంక్రాంతి బరిలో దింపుతారా అనే చర్చలు కూడా జరిగాయి.

2021 Telugu Films: తెలుగు సినిమాను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమాలివే!

కానీ, భీమ్లా నాయక్ మేకర్స్ పవన్ సినిమాను తీసుకురాలేదు కానీ వారి బ్యానర్ నుండి మరో సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నారు. యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన సినిమా ‘డీజే టిల్లు’ సంక్రాంతి రేసులో ఎంటర్ అయ్యింది. జనవరి 14న సినిమాను విడుదల చేస్తున్నట్టు తాజాగా వెల్లడించారు. విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

OTT Release: కంటెంట్ ఉంటే చాలు.. కనెక్ట్ అయిపోతున్న ఆడియన్స్!

దర్శకుడు విమల్ కృష్ణతో కలిసి హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఈ కథ రాయడం విశేషం కాగా మాటలు కూడా ఆయనే అందించారు. న్యూ ఏజ్ రొమాంటిక్ సినిమా డీజే టిల్లుకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో అవి ఫినిష్ చేసి, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి యూనిట్ రెడీ అవుతోంది. ఈ మధ్యనే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ లో హీరోయిన్ పాదాలను హీరో తన పెదాలతో స్పృశించటం చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తిస్తోంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదనిపిస్తుంది.