DJ Tillu: బాలీవుడ్‌లో డీజే కొడుతున్న టిల్లు.. నిజమేనా..?

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘డీజే టిల్లు’ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి, ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటం.. ఈ సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమా జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఈ సినిమా అందుకున్న బంపర్ సక్సెస్‌తో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

DJ Tillu: బాలీవుడ్‌లో డీజే కొడుతున్న టిల్లు.. నిజమేనా..?

DJ Tillu To Be Ramade In Bollywood

DJ Tillu: టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘డీజే టిల్లు’ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి, ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటం.. ఈ సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమా జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఈ సినిమా అందుకున్న బంపర్ సక్సెస్‌తో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

DJ Tillu 2: సీక్వెల్ రిలీజ్ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన డీజే టిల్లు!

‘డీజే టిల్లు స్క్వేర్’ అనే టైటిల్‌తో ఈ సీక్వెల్ మూవీని చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. కాగా, ఇప్పుడు డీజే టిల్లు మూవీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట. ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు అక్కడి మేకర్స్ రెడీ అవుతున్నారట. డీజే టిల్లు సినిమాను హిందీలో రీమేక్ చేస్తే, ఈ మూవీ అక్కడి యూత్‌ను కూడా ఆకట్టుకోవడం ఖాయమని బాలీవుడ్ దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఈ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారు.. ఎవరు హీరోగా నటిస్తారనే విషయంపై మాత్రం బాలీవుడ్ నుండి ఎలాంటి వార్తలు రావడం లేదు.

DJ Tillu: ముచ్చటగా ముగ్గురుని మార్చిన డీజే టిల్లు.. ఎటు వెళ్తుందో?

ఇక ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ మూవీ కోసం పలు కీలక మార్పులు చేశారు. టిల్లు స్క్వేర్ మూవీని దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తుండగా, హీరోయిన్‌గా నేహాశెట్టిని కాదని, అనుపమ పరమేశ్వరన్‌ను సెలెక్ట్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఆమె కూడా ఈ సినిమా నుండి వాకౌట్ చేయడంతో, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి టాలీవుడ్‌లో టిల్లు స్క్వేర్, బాలీవుడ్‌లో డీజీ టిల్లు రేమేక్ చిత్రాలు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఎప్పటికి పూర్తవుతాయో చూడాలి.