అవార్డులు నాకు విషయం కాదు.. పర్‌ఫార్మెన్స్ బాగా చేస్తున్నానా లేదా అంతే అంటోన్న తమన్నా.. బాలీవుడ్‌పై ఘాటు వ్యాఖ్యలు

అవార్డులు నాకు విషయం కాదు.. పర్‌ఫార్మెన్స్ బాగా చేస్తున్నానా లేదా అంతే అంటోన్న తమన్నా.. బాలీవుడ్‌పై ఘాటు వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో నెపోటిజమ్, ఇన్‌సైడర్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్, లాబీ సిస్టమ్, టాక్సిక్ స్టార్ కల్చర్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ సినిమా పరిశ్రమలో జరుగుతున్న రచ్చే ఇది. హీరోహీరోయిన్లు తమకు జరుగుతున్న అన్యాయాల గురించి, అవార్డు ఫంక్షన్ల గురించి ఓపెన్ గా చెబుతున్నా పట్టించుకునే వాళ్లే లేరు. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో మరోసారి ఇది హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ యాక్టర్ అభయ్ డియోల్ ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చాడు. జిందగీ న మిలేగీ న దుబారా.. సినిమాలో సపోర్టింగ్ యాక్టర్స్ గా చేసిన పర్షాన్ అక్తర్, నేనూ డిమోట్ అయ్యాం. అవార్డు ఫంక్షన్లో అవమానం పాలయ్యాం. సినీ ఇండస్ట్రీలో చాలా మంది కోవర్టులు, ఓవర్టులు ఎన్నో రకాలుగా కిందకు లాగేయాలని ప్రయత్నిస్తుంటారు. ఇది సిగ్గు చేటు చర్య” అని రాసుకొచ్చాడు.

దీనిపై దక్షిణాధిలో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న తమన్నా కూడా రెస్పాండ్ అయ్యారు. బాలీవుడ్ లో అవార్డు నామినేషన్ లో జరుగుతున్న అన్యాయానికి తానూ బలైపోయిందని కామెంట్ చేశారు. ‘టైంతో పాటు నేను కూడా రియలైజ్ అయ్యా. అవార్డులు ఇవ్వకపోతే పర్‌ఫార్మర్ స్వభావం ఏమీ మారిపోదు. నిన్ను సపోర్ట్ చేసే అభిమానులు తగ్గిపోరు. నేను సినిమాలు చేసే పద్ధతి సంతృప్తికరంగా ఉంటే సినిమాలు బాగా చేస్తూ ఉంటే మిగిలినవేమీ పట్టించుకునే విషయాలు కావు’ అని అన్నారు.

తమన్నా విషయంలోనే కాదు. తక్కువ స్థాయి సపోర్టింగ్ యాక్టర్లందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఇండస్ట్రీలో పరిచయాలు, బ్యాక్ సపోర్ట్ ఉన్న వాళ్లకే ఆదరణ దక్కుతుందని విమర్శకుల అభిప్రాయం.