Kangana Ranaut: ఇలాంటి చెత్తను అమ్మకానికి పెట్టకండి.. గెహ్రియాన్‌పై కంగనా వ్యాఖ్యలు!

బాలీవుడ్ క్వీన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దీపికా పదుకొనె గెహ్రియాన్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అర్బన్ సినిమాలపై పేరుతో ఇలాంటి చెత్తను..

Kangana Ranaut: ఇలాంటి చెత్తను అమ్మకానికి పెట్టకండి.. గెహ్రియాన్‌పై కంగనా వ్యాఖ్యలు!

Kangana Ranaut

Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దీపికా పదుకొనె గెహ్రియాన్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అర్బన్ సినిమాలపై పేరుతో ఇలాంటి చెత్తను అమ్మకానికి పెట్టకండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘నేను కూడా ఈ తరానికి చెందిన వ్యక్తినే. కానీ ఇలాంటి రొమాన్స్‌ని అర్థం చేసుకోగలను. దయచేసి కొత్తతరం యువత, అర్భన్‌ సినిమాల పేరుతో ఇలాంటి చెత్తను అమ్మకానికి పెట్టకండి. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలుగానే ఉంటాయి.

KGF 2: ప్రమోషన్ల సీజన్.. యష్ కూడా మొదలు పెట్టేస్తున్నాడు!

స్కిన్ షో, అశ్లీలత వంటివి చెత్త సినిమాల‌ను ఏమాత్రం కాపాడలేవు’ అంటూ ఇన్‌స్టా వేదికగా కంగనా విమర్శలు గుప్పించింది. అసలే ఈ సినిమాలో దీపికా పదుకొనె.. సిద్దార్థ్ చతుర్వేదితో కలిసి రెచ్చిపోయి నటించింది. ముద్దులు.. బెడ్ రూమ్ సన్నివేశాలలో రెచ్చపోయిన ఈ జంటపై తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దీపికపై గత నెలరోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర కామెంట్లు కనిపిస్తున్నాయి.

Siddhu Jonnalagadda : ‘డిజే టిల్లు’ ఫస్ట్ డే కలెక్షన్స్ 4 కోట్లు.. చిన్న సినిమాకి పెద్ద కలెక్షన్స్..

పెళ్లి తర్వాత కూడా ఇంతలా ఇంటిమెంట్ సీన్లలో రెచ్చపోతున్నావ్.. అసలు మీ ఆయనకి చెప్పే చేశావా అంటూ నెటిజన్లు మండిపడగా.. వాటికి దీపికా గట్టిగానే కౌంటర్లు ఇచ్చింది. పెళ్లి తర్వాత.. అది కూడా తనకంటే జూనియర్, చిన్నవాడైన చతుర్వేదితో ఇలాంటి సీన్లను చేయడాన్ని దీపికా అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నారు. నెగటివ్ కామెంట్లను కూడా తన పబ్లిసిటికి వాడేసుకుంది దీపికా. మరి ఇప్పుడు తోటి నటి.. బాలీవుడ్ హీరోయిన్ కంగనా చేసిన వ్యాఖ్యలపై దీపికా ఎలా స్పందిస్తుందో చూడాలి.