Agent Tina : విక్రమ్ సినిమాలో ఏజెంట్ టీనాగా చేసింది ఎవరో తెలుసా? ఆమె ఎంత ఫేమసో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
విక్రమ్ సినిమాలో పని మనిషిగా కనిపించి చివరలో ఏజెంట్ టీనా అని ఒక్కసారిగా విలన్ల మీద విరుచుకుపడిన ఈ క్యారెక్టర్ బాగా ఫేమస్ అయింది. దర్శకుడు ఇచ్చిన ఈ ట్విస్ట్ సినిమాకి మరింత ప్లస్ అయింది. ఈ క్యారెక్టర్ కి..............

Vikram : కమల్ హాసన్ హీరోగా, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా విక్రమ్. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది ఈ సినిమా. ఇప్పటికే దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేసింది. చాలా రోజుల తర్వాత కమల్ కి పెద్ద హిట్ రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ సినిమా యునిట్ కి గిఫ్ట్స్, పార్టీలు ఇస్తున్నారు. అయితే సినిమాలో మెయిన్ పాత్రలన్నిటితో పాటు బాగా హైలెట్ అయిన పాత్ర ఏజెంట్ టీనా.
విక్రమ్ సినిమాలో పని మనిషిగా కనిపించి చివరలో ఏజెంట్ టీనా అని ఒక్కసారిగా విలన్ల మీద విరుచుకుపడిన ఈ క్యారెక్టర్ బాగా ఫేమస్ అయింది. దర్శకుడు ఇచ్చిన ఈ ట్విస్ట్ సినిమాకి మరింత ప్లస్ అయింది. ఈ క్యారెక్టర్ కి కూడా బాగా పేరొచ్చింది. దీంతో ఈ టీనా పాత్ర చేసింది ఎవరా అని నెట్ లో వెతుకుతున్నారు ప్రేక్షకులు. ఏజెంట్ టీనా అసలు పేరు వాసంతి. ఈమె కోలీవుడ్ లో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్. తమిళంలో చాలా సినిమాలకి, ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు ఈమె కొరియోగ్రఫీ అందించింది. తమిళ్ లో ఫేమస్ డ్యాన్స్ మాస్టర్ వాసంతి.
లోకేష్ కనగరాజ్ తో ఉన్న పరిచయంతో లోకేష్ ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ చేయమని అడగగానే ఓకే చెప్పింది. వాసంతికి విక్రమ్ ఫస్ట్ సినిమా కావడం విశేషం. తొలి సినిమాతోనే ఏజెంట్ టీనాగా మంచి గుర్తింపు వచ్చింది. దీంతో వాసంతి ఇదంతా మా డైరెక్టర్ వల్లే అని లోకేశ్ కనగరాజుకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలుపుతూ స్పెషల్ పోస్ట్ పెట్టింది. లోకేష్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ”విక్రమ్ లాంటి సినిమాలో నేను భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజు గారికి కృతజ్ఞతలు. నా అసలు పేరు వాసంతి. కానీ ఇప్పుడు అందరూ నన్ను ఏజెంట్ టీనా అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులంతా నన్ను టీనాగా గుర్తిస్తున్నారు” అని పోస్ట్ చేసింది.
Am proud be a part of #Vikram thanks #LokeshKanakaraj sir given me a opportunity for Vikram and my name is vasanthi but create new name agent Tina every one wishing me as Tina. Am so happy.Audience recognize me Tina. pic.twitter.com/MI0pPPUSoH
— Agent_Tina vasanthi (@Agent_Tena) June 19, 2022
1Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
2Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
3Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
4presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
5Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
6Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
7The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
8DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
9Enforcement Directorate: మనీలాండరింగ్ కేసు.. ఢిల్లీ మంత్రి సత్యేందర్ అనుచరులు ఇద్దరు అరెస్టు
10Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!
-
Boyfriend Attempted Suicide : ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఫంక్షన్ హాల్ వద్దే కిరోసిన్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం
-
Metro Rail Stations : అద్దెకు మెట్రో స్టేషన్లు..రైల్ స్టేషన్లలో ఆఫీస్ బబుల్స్