BiggBoss 6: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ సుదీప(పింకీ) గురించి మీకు తెలుసా..

బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. ఈ సీజన్‌ రెండో కంటెస్టెంట్‌గా 'నువ్వు నాకు నచ్చావ్' ఫేమ్ పింకీ అలియాస్ సుదీప ఎంట్రీ ఇచ్చింది. మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు, నువ్వు నాకు నచ్చావ్, బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్, వంటి సినిమాల్లో నటించిన సుదీప...

BiggBoss 6: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. “ఈ ఫీల్డ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నా తరవాతే” అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున. ఆ తర్వాత బంగార్రాజు టైటిల్‌ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి స్టెప్పులేశారు. మనకి రుచులు ఆరు, రుతువులు ఆరు, ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ కూడా ఆరు అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌ బిగ్‌బాస్‌ 6 అని షో గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. ఆ తర్వాత తనే హౌస్‌లోకి వెళ్లి హౌస్ మొత్తాన్ని చూపించారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో కంటే కూడా మరింత రిచ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని స్టేజి మీదకి పిలిచాడు.

BiggBoss 6: బిగ్‌బాస్‌ తొలి కంటెస్టెంట్‌ కీర్తి కేశవ్ భట్‌ గురించి మీకు తెలుసా..

ఈ సీజన్‌లో రెండో కంటెస్టెంట్‌గా ‘నువ్వు నాకు నచ్చావ్’ ఫేమ్ పింకీ అలియాస్ సుదీప ఎంట్రీ ఇచ్చింది. సుదీప తల్లిదండ్రులు ఇద్దరు క్లాసికల్ డాన్స్ టీచర్స్ కావడంతో చిన్నతనం నుంచే క్లాసికల్ డాన్స్ లో మంచి ప్రావిణ్యం తెచ్చుకుంది. 1994లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ధర్మరాజు ఎం.ఏ సినిమాతో ఆమె ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు, నువ్వు నాకు నచ్చావ్, బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్, వంటి సినిమాల్లో నటించింది. సుదీప ఎక్కువగా హీరోలకి చెల్లెలుగా నటిస్తూ వచ్చింది.

ఆ తర్వాత బుల్లితెరపై కూడా కొన్ని సీరియల్స్‌లో అలరించింది. శ్రీరంగనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను ప్రేమించిన సుదీప నాలుగేళ్లు ఫ్యామిలీతో పోరాడి అతన్ని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు బిగ్‌బాస్‌-6తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుదీప నాగార్జునతో మాట్లాడుతూ..”నేను చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అందరి స్టార్ హీరోస్ తో యాక్ట్ చేశాను ఒక్క మీతో తప్ప, ఇప్పుడు అది కూడా ఈ బిగ్‌బాస్‌ తో ఫుల్ ఫిల్ అయింది” అని సంతోషం వ్యక్తం చేసింది.

ట్రెండింగ్ వార్తలు