Inaya Sulthana: బిగ్‌బాస్‌6 కంటెస్టెంట్ ఇనయా సుల్తానా గురించి మీకు తెలుసా..

బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో 15వ కంటెస్టెంట్‌గా ఇనయా సుల్తానా ఎంట్రీ ఇచ్చింది. ఇనయాకి మోడలింగ్‌, సినిమాలపై ఆసక్తి ఉండడంతో ఇంట్లో వారికి కూడా చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసి అవకాశాల కోసం ఎదురుచూస్తూ షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఉండేది. ఆ తర్వాత...

Inaya Sulthana: బిగ్‌బాస్‌6 కంటెస్టెంట్ ఇనయా సుల్తానా గురించి మీకు తెలుసా..

Do You Know About BiggBoss Contestant Inaya Sulthana

Inaya Sulthana: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. “ఈ ఫీల్డ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నా తరవాతే” అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున. ఆ తర్వాత బంగార్రాజు టైటిల్‌ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి స్టెప్పులేశారు. మనకి రుచులు ఆరు, రుతువులు ఆరు, ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ కూడా ఆరు అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌ బిగ్‌బాస్‌ 6 అని షో గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. ఆ తర్వాత తనే హౌస్‌లోకి వెళ్లి హౌస్ మొత్తాన్ని చూపించారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో కంటే కూడా మరింత రిచ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని స్టేజి మీదకి పిలిచాడు.

ఈ సీజన్‌లో 15వ కంటెస్టెంట్‌గా ఇనయా సుల్తానా ఎంట్రీ ఇచ్చింది. ఇనయాకి మోడలింగ్‌, సినిమాలపై ఆసక్తి ఉండడంతో ఇంట్లో వారికి కూడా చెప్పకుండా హైదరాబాద్ వచ్చేసి అవకాశాల కోసం ఎదురుచూస్తూ షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఉండేది. ఆ తర్వాత బుజ్జి ఇలా రా, నట రత్నాలు, యద్భావం తద్ భవతి వంటి పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత ఇనయాకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడడంతో 2021లో తన పుట్టినరోజును RGVతో కలిసి జరువుకుంది.

నాలుగు రోజుల తరువాత తను చేసిన డ్యాన్స్ వీడియో వెలుగులోకి వచ్చి ఓవర్ నైట్ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ వీడియో చుసిన ఆమె తల్లి ఫోన్ చేసి..కుటుంబ పరువు మొత్తం తీస్తున్నావు అని తిట్టారంటూ, దానికి ఆమె బదులిస్తూ నేను వర్మ గారితో కేవలం డాన్స్ మాత్రమే చేశాను ఎలాంటి అశ్లీలమైన వీడియోలు చేయలేదని చెప్పినప్పటికీ, ఆమె కుటుంబం తనని పూర్తిగా దూరం పెట్టిందని..ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. ఆర్జీవీ వీడియోతో ఫేమస్ అయినా ఇనయా బిగ్‌బాస్‌తో ఇంకెంతటి ఫేమ్ సంపాదించుకుంటుందో చూడాలి.