Keerthy Suresh: మహానటి మొదటి జీతం ఎంతో తెలుసా?

తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందం, అభినయం కలగలిసిన ఈ అమ్మడు.. చిన్ననాటి నుంచి సినిమాల్లో నటించడం ప్రారంభించారు. తెలుగులో చాలా సినిమాలు చేశారు. మహానటి సావిత్రి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో కీర్తి అద్భుతంగా నటించారు. అభిమానులను కన్నీరు పెట్టించారు.

Keerthy Suresh: మహానటి మొదటి జీతం ఎంతో తెలుసా?

Keerthy Suresh

Keerthy Suresh: తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందం, అభినయం కలగలిసిన ఈ అమ్మడు.. చిన్ననాటి నుంచి సినిమాల్లో నటించడం ప్రారంభించారు. తెలుగులో చాలా సినిమాలు చేశారు. మహానటి సావిత్రి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో కీర్తి అద్భుతంగా నటించారు. అభిమానులను కన్నీరు పెట్టించారు.

బాల్యంలోనే కెమెరా ముందుకు వచ్చిన కీర్తి తన మొదటి జీతం విశేషాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “తాను నటించిన సినిమాకు నిర్మాతలు డబ్బుల కవర్‌ చేతికిచ్చేవారు. ఆ కవర్ లో ఎంత డబ్బు ఉండేదో నాకసలు తెలియదు. దానిని నేరుగా తీసుకెళ్లి నాన్నకు అప్పజెప్పేదాన్నని తెలిపారు.

కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేసమయంలో ఒక షోలో పాల్గొన్నానని.. ఈ సాయంలో రూ. 500 ఇచ్చారని ఇదే తనకు గుర్తు ఉన్న తోలి పారితోషకం అని తెలిపారు. అది కూడా తన తండ్రికే ఇచ్చానండి మహానటి. ఇక ఇదిలా వుంటే కీర్తి సురేశ్‌.. రజనీకాంత్‌ అన్నాత్తే, మహేశ్‌బాబు సర్కారు వారి పాట చిత్రాల్లో నటిస్తోంది. తను ప్రధానపాత్రలో నటించిన గుడ్‌ లక్‌ సఖి రిలీజ్‌కు రెడీగా ఉంది.