Yash-Radhika : KGF స్టార్ యశ్ తన భార్యకి ఫస్ట్ గిఫ్ట్ ఏం ఇచ్చాడో తెలుసా?.. తెలిస్తే నవ్వాపుకోలేరు.. ఫోటో షేర్ చేసిన రాధికా పండిట్..

రాధికా పండిట్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా అంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉంటుంది రాధికపండిట్. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది రాధికా. ఇందులో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు...............

Yash-Radhika : KGF స్టార్ యశ్ తన భార్యకి ఫస్ట్ గిఫ్ట్ ఏం ఇచ్చాడో తెలుసా?.. తెలిస్తే నవ్వాపుకోలేరు.. ఫోటో షేర్ చేసిన రాధికా పండిట్..

do you know the first gift from yash to her wife radhika pandit its hilarious

Yash-Radhika :  KGF తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ స్టార్ హీరో యశ్. కన్నడలో సీరియల్స్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. కన్నడ హీరోయిన్ రాధికా పండిట్ ని ప్రేమించి 2016 లో పెళ్లి చేసుకున్నాడు యశ్. యశ్, రాధికపండిట్ కలిసి కన్నడలో డ్రామా, మొగ్గిన మనసు, మిస్టర్ మిస్ రామాచారి, సంతు స్ట్రైట్ ఫార్వార్డ్ అనే నాలుగు సినిమాల్లో నటించారు. ఈ సినిమాలు మంచి విజయం సాధించాయి.

రాధికా పండిట్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా అంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉంటుంది రాధికపండిట్. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది రాధికా. ఇందులో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని మీరు యశ్ సర్ నుంచి ఫస్ట్ అందుకున్న గిఫ్ట్ ఏంటి అని అడిగారు. దీనికి రాధికా సమాధానమిస్తూ ఓ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫొటోలో యశ్ రాధికకు కొత్తిమీర కట్టలను గిఫ్ట్ గా ఇస్తున్నాడు.

Samantha : ఖుషీ షూటింగ్ మొదలుపెట్టిన టీం.. ఉమెన్స్ డే రోజు సామ్ కి గ్రాండ్ వెల్కమ్

రాధికా ఈ ఫోటో షేర్ చేసి ది మోస్ట్ లవ్లీ బంచ్ ఆఫ్ ఫ్రెష్… అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఆ ఫొటోలో కొత్తిమీర కట్టలు ఉండటంతో అంతా ఆశ్చర్యపోయి తెగ నవ్వుకుంటున్నారు. అయితే ఆ ఫోటో చూస్తే కెరీర్ మొదట్లో ఏదో సినిమా ప్రమోషన్స్ లో సరదాగా ఇచ్చింది అయి ఉంటుందని భావిస్తున్నారు. రాధికా ఈ ఫోటో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఈ ఫోటోకి సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి యశ్ కొత్తిమీర కట్టలను తన భార్యకు ఫస్ట్ గిఫ్ట్ గా ఇవ్వడంతో దీనిగురించి అంతా సరదాగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం యశ్, రాధికా, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక యశ్ అభిమానులు KGF తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.