Prabhas : ప్రభాస్‌కి చిరాకొచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా??

గోపీచంద్, ప్రభాస్ ఇద్దరూ ఫ్రెండ్స్ కావడంతో ఇద్దరికీ కామన్ గా పలు ప్రశ్నలు అడిగాడు బాలయ్య. ఇందులో మీ ఇద్దరూ చిరాకుగా ఉంటే ఏం చేస్తారు అని అడిగాడు బాలకృష్ణ. దీనికి ప్రభాస్..................

Prabhas : ప్రభాస్‌కి చిరాకొచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా??

Do you know what Prabhas does when he gets angry?

Prabhas :  బాలకృష్ణ యాంకర్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంతో గ్రాండ్ సక్సెస్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే రెండో సీజన్ లో కూడా ఏడు ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ వచ్చి అలరించాడు. ఈ ఎపిసోడ్ కి భారీ స్పందన వచ్చింది. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు దేశవ్యాప్తంగా ఈ షోని చూశారు. ప్రభాస్ ఎపిసోడ్ తో ఆహా ఓటీటీకి బాగా రీచ్ వచ్చింది. అయితే ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా టెలికాస్ట్ చేయాలనుకున్నారు.

ఏడో ఎపిసోడ్ లో కేవలం ప్రభాస్ తో నడిపించి ఎనిమిదో ఎపిసోడ్ లో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, హీరో గోపీచంద్ ని కూడా తీసుకొచ్చారు. వీరి కాంబినేషన్ ఎపిసోడ్ నేడు జనవరి 6 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో ఈ ఎపిసోడ్ కూడా ప్రేక్షకుల్లో బాగా రీచ్ అవుతుంది. ఎనిమిదో ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి ప్రభాస్, గోపీచంద్ రచ్చ రచ్చ చేశారు. ఎపిసోడ్ ఆద్యంతం నవ్వించారు, అలరించారు, ఎన్నో గుర్తుండిపోయే మూమెంట్స్ ని ప్రేక్షకులకి అందించారు.

గోపీచంద్, ప్రభాస్ ఇద్దరూ ఫ్రెండ్స్ కావడంతో ఇద్దరికీ కామన్ గా పలు ప్రశ్నలు అడిగాడు బాలయ్య. ఇందులో మీ ఇద్దరూ చిరాకుగా ఉంటే ఏం చేస్తారు అని అడిగాడు బాలకృష్ణ. దీనికి ప్రభాస్.. గోపీచంద్ కి అసలు కోపం, చిరాకు రాదు. ఓపిక చాలా ఎక్కువ. ఒకసారి షూటింగ్ లో ముక్కుకి గాయం అయి బ్లడ్ వస్తుంది, అలాంటి సమయంలో కూడా నేను నవ్వుతూ వాడ్ని కొట్టినా కూల్ గా మాట్లాడాడు. గోపీచంద్ కి అసలు చిరాకే రాదు అని అన్నాడు.

ఇక గోపీచంద్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ కి కోపం కానీ, చిరాకు కానీ వస్తే అందర్నీ వెళ్ళిపోమంటాడు, పక్కన ఎవ్వర్నీ ఉండొద్దు అంటాడు. మొత్తం అందర్నీ గెట్ అవుట్ అంటాడు. తర్వాత ఒక్కడే వెళ్లి కూర్చొని సిగరెట్ తాగుతాడు అని చెప్పాడు. అయితే సిగరెట్ తాగుతాడు అనేది డైరెక్ట్ గా చెప్పకుండా సింబల్ చూపించాడు గోపీచంద్.