Alia-Ranbir : ఆలియా-రణబీర్ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా?? ఫేవరేట్ ప్లేస్ అంటూ ఆలియా పోస్ట్..

తమ పెళ్లి ఫోటోలని షేర్ చేసిన ఆలియా.. ''ఈ రోజు మా కుటుంబం, స్నేహితులు అంతా మా చుట్టే ఉన్నారు. మాకు చాలా ఇష్టమైన ప్రదేశంలో, మేము మా ప్రేమలో ఉన్న 5 సంవత్సరాలలో ఎక్కువగా...............

Alia-Ranbir : ఆలియా-రణబీర్ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా?? ఫేవరేట్ ప్లేస్ అంటూ ఆలియా పోస్ట్..

Alia

 

Alia-Ranbir :  బాలీవుడ్‌ లవ్ బర్డ్స్ ఆలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ నిన్న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబై బాంద్రాలోని వాస్తు అపార్ట్‌మెంట్‌లో వీరి పెళ్లి జరిగింది. ఐతే పెళ్లి అయ్యేంతవరకు సీక్రెట్ గానే ఈ వ్యవహారాన్ని నడిపించారు. ఇక వివాహం అయ్యాక వీరే స్వయంగా ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆలియా తన పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ఈ పోస్ట్ లో వారి పెళ్లి ఎక్కడ జరిగింది, ఎందుకు అక్కడే చేసుకుందో స్పెషల్ గా తెలిపింది. తమ పెళ్లి ఫోటోలని షేర్ చేసిన ఆలియా.. ”ఈ రోజు మా కుటుంబం, స్నేహితులు అంతా మా చుట్టే ఉన్నారు. మాకు చాలా ఇష్టమైన ప్రదేశంలో, మేము మా ప్రేమలో ఉన్న 5 సంవత్సరాలలో ఎక్కువగా గడిపిన బాల్కనీలో మా వివాహం చేసుకున్నాం. ఈ బాల్కనీలో మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. మేము కలిసి మరిన్ని జ్ఞాపకాలను నిర్మించుకోవడానికి రెడీగా ఉన్నాము. ప్రేమ, నవ్వు, నిశ్శబ్దాలు, సినిమా రాత్రులు, మా ఇద్దరి చిలిపి ఫైట్స్, వైన్ డిలైట్‌లు, చైనీస్ వంటలు.. ఇలా బోల్డన్ని జ్ఞాపకాలు మేం ఏర్పరుచుకుంటాము. మా జీవితంలో ఈ క్షణం ఎంతో ప్రత్యేకమైంది” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.

Pooja Hegde: అల్ట్రా స్టైలిష్‌గా పూజా హెగ్డే.. అదరగొట్టిన బుట్టబొమ్మ!

ఎక్కడైతే ప్రేమించుకున్నామో అక్కడే పెళ్లి చేసుకున్నాము అంటూ బాల్కనీలో పెళ్లి చేసుకున్న విషయాన్ని ఇలా తెలిపింది రణబీర్. ఇలా బాల్కనీలో పెళ్లి చేసుకోవడం కొంతమందికి ఆశ్చర్యం కలగచేస్తుంటే, మరికొంతమంది ప్రేమకి గుర్తుగా ఇలా చేసుకున్నారు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ కపుల్స్ లో మరో స్టార్ కపుల్ జత చేరారు. నెటిజన్లు, అభిమానులు, సెలబ్రిటీలు వీరికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.