Thalapathy Vijay : పదేళ్ల బాలుడి ప్రాణం నిలిపిన విజయ్ బిగిల్ సినిమా

చికిత్సకు తగ్గని దీర్ఘకాల వ్యాధులతో చావుకు దగ్గరగా ఉన్నఅభిమానులను కలిసి వారి చివరి కోరికలు తీర్చూతూ ఉఁటారు సినిమా హీరోలు సెలబ్రిటీలు. ఇటీవల తమిళనాడుకు చెందిన ఒక బాలుడు తన అభిమాన హీరో సినిమా చూస్తూ చికిత్స చేయించుకున్న ఘటన వెలుగు చూసింది.

Thalapathy Vijay : పదేళ్ల బాలుడి ప్రాణం నిలిపిన విజయ్ బిగిల్ సినిమా

Vijay Bigil Cinema

Thalapathy Vijay : అభిమాన సినిమా హీరో సినిమా చూస్తే అభిమానులకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. హీరో లో తమను తాము ఐడెంటీఫై చేసుకుంటారు. హీరో చేసే పనులు తామే చేసినట్లు ఫీలై ఎనర్జీ పొందుతారు. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న అభిమానులను వెళ్లి పరామర్శించటం.. లేదంటే వారితో వీడియో కాల్ లో మాట్లాడి వారికి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు.

చికిత్సకు తగ్గని దీర్ఘకాల వ్యాధులతో చావుకు దగ్గరగా ఉన్నఅభిమానులను కలిసి వారి చివరి కోరికలు తీర్చూతూ ఉఁటారు సినిమా హీరోలు సెలబ్రిటీలు. ఇటీవల తమిళనాడుకు చెందిన ఒక బాలుడు తన అభిమాన హీరో సినిమా చూస్తూ చికిత్స చేయించుకున్న ఘటన వెలుగు చూసింది.

తమిళనాడు, చెన్నైలోని మైలాపూర్ కు చెందిన శశి అనే పదేళ్ల బాలుడు ఇటీవల తన మేనమామతో బైక్ పై వెళుతుండగా యాక్సిడెంట అయి కింద పడ్డాడు. దీంతో పిల్లాడి తలకు తీవ్రగాయం అయ్యింది. చికిత్స నిమిత్తం బాలుడ్ని రాయ్‌పేటలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు తలకు కుట్లు వేయాలని చెప్పారు.

కుట్లు వేసేందుకు డాక్టర్లు మత్తు మందు ఇచ్చేందుకు ప్రయత్నించగా బాలుడు మారం చేశాడు. డాక్టర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. ఇంతలో ఇంకో డాక్టరు బాలుడితో మాట్లాడుతూ అతని అభిమాన హీరో గురించి తెలుసుకున్నాడు.

దళపతి విజయ్ అభిమాన నటుడు అని తెలుసుకున్న డాక్టర్ విజయ్ నటించిన బిగిల్ చిత్రాన్ని తనమొబైల్ లో చూపిస్తూ ఉండగా మరో డాక్టర్ బాలుడికి కుట్లు వేసి ప్రాణాలు రక్షించాడు. ఈ న్యూస్ తెలుసుకున్న వార ఆ డాక్టర్ కు హ్యాట్సాఫ్ చెపుతున్నారు.