Ashu Reddy: అషు పాప హద్దులు దాటేస్తుందా?

సోషల్ మీడియా.. వయా స్మాల్ స్క్రీన్.. టార్గెట్ సిల్వర్ స్క్రీన్. ఇది అషు రెడ్డి టార్గెట్.. ఒక్క అషు మాత్రమే కాదు.. ఇలా వచ్చే అందరిదీ అదే టార్గెట్. అందులో భాగంగానే అషుపాప కూడా..

Ashu Reddy: అషు పాప హద్దులు దాటేస్తుందా?

Ashu Reddy (image :Instagram)

Ashu Reddy: సోషల్ మీడియా.. వయా స్మాల్ స్క్రీన్.. టార్గెట్ సిల్వర్ స్క్రీన్. ఇది అషు రెడ్డి టార్గెట్.. ఒక్క అషు మాత్రమే కాదు.. ఇలా వచ్చే అందరిదీ అదే టార్గెట్. అందులో భాగంగానే అషుపాప కూడా దాదాపు ఐదారేళ్లుగా ఈ షో ఆ షో అని లేకుండా.. ఈవెంట్లు.. స్టేజి షోలలో బాగానే సందడి చేస్తూ దూసుకుపోతోంది. అద్భుతమైన గ్లామర్‌.. అసలే అమెరికా నుండి దిగుమతి కావడంతో పెద్దగా హద్దులు లేవు. ఇంకా చెప్పాలంటే అందాలను అసలు దాచుకోదు. అందుకే చేతి నిండా పని దొరుకుతుంది.

Ashu Reddy

Ashu Reddy

Samantha: తాప్సి నిర్మాతగా సామ్ బాలీవుడ్ సినిమా!

ఒకటికి మూడు ఛానెళ్లలో కామెడీ షోలలో సందడి చేస్తున్న అషు.. ఆ మధ్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో హైలెట్ కావాలనుకుంది. గతంలో అరియనా లాంటి వాళ్ళు అలా ఆర్జీవీతో చేతిలో పడి సెలబ్రిటీలు కావడంతో అషు కూడా ఆర్జీవీ మీదనే ఆశలు పెట్టుకుంది. కానీ.. అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఒకటీ రెండు రోజులు ఫోటోలు, ఇంటర్వూ హల్చల్ చేసినా తర్వాత అందరూ మర్చిపోయారు. అందుకే ఇప్పుడు.. తగ్గదేలేదని వరసగా ఫోటో షూట్లు చేసి వదులుతుంది.

Ashu Reddy

Ashu Reddy

Chef Salt Bae: చెత్త కవరే టీషర్ట్.. ఇదెక్కడి దిక్కుమాలిన ఫ్యాషన్ రా బాబు!

మోడ్రన్ డ్రెస్సుల్లో అషుకి ఎలాంటి దాపరికం ఉండదు. అందుకే స్కర్ట్స్ వేసి ఫోటోలకు ఫోజులివ్వగా ఆ కెమెరానే చిన్నబోయింది. అయినా చాలదనుకుందో ఏమో ఈసారి ఏకంగా షర్ట్ బటన్ విప్పేసి కెమెరాకి అప్పగించేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. అసలు వెండితెర మీదకి చేరకుండానే.. స్టార్ కాకుండానే ఇలా అన్ని చూపించేస్తే ఇంక డిమాండ్ ఏముంటుంది పాపా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చూస్తే ఇది ఒకరంగా హద్దులు దాటేస్తుందా అనిపిస్తుంది!