Don : ‘డాన్’కి మరో సీక్వెల్.. అమితాబ్, షారుఖ్ కాంబోలో??

డాన్ పోస్టర్ పైన ''ఎర్రర్.. కంటిన్యూయింగ్ ఇన్ ద సేమ్ వీన్ డాన్'' అని రాస్తున్న బిగ్ బి, షారూక్ ఖాన్ డిస్కషన్ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయడంతో అటు బిగ్ బి, ఇటు బాద్షా ఫ్యాన్స్ డాన్ 3 ఉంటుందని....................

Don : ‘డాన్’కి మరో సీక్వెల్.. అమితాబ్, షారుఖ్ కాంబోలో??

Don 3

Don :  షారూఖ్ ఖాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ డాన్. రెండు పార్టులూ బాక్సాఫీస్ దగ్గెర కలెక్షన్ల వర్షం కురిపించాయి. డాన్ 3వ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. 1978లోనే బాలీవుడ్ లో డాన్ సినిమా వచ్చింది. కాకపోతే అది షారూక్ ఖాన్ సినిమా కాదు, అమితాబచ్చన్ సినిమా. అప్పుడు ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇప్పటికీ ఆ సినిమా పాటలు సూపర్ హిట్. ఇక 2006లో షారూక్ ఖాన్ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో డాన్ సినిమా తీసి హిట్ కొట్టాడు. దానికి సీక్వెల్ గా 2011లో డాన్ 2తో మరో సారి సూపర్ హిట్ కొట్టాడు షారుఖ్. దాదాపు 11 సంవత్సరాల తర్వాత షారూక్ తో పాటు, బిగ్ బి ఫ్యాన్స్ మధ్య డాన్ 3 చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు మెయిన్ రీజన్ అమితాబచ్చన్ లేటెస్ట్ పోస్టే.

డాన్ పోస్టర్ పైన ”ఎర్రర్.. కంటిన్యూయింగ్ ఇన్ ద సేమ్ వీన్ డాన్” అని రాస్తున్న బిగ్ బి, షారూక్ ఖాన్ డిస్కషన్ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయడంతో అటు బిగ్ బి, ఇటు బాద్షా ఫ్యాన్స్ డాన్ 3 ఉంటుందని, అది కూడా బిగ్ బి, బాద్షా కాంబోలో రాబోతుందని తెగ సంబరపడిపోతున్నారు. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత షారూక్ ఫ్యాన్స్ కు వరుస సినిమాలతో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లో అమితాబ్ కాంబినేషన్ సినిమా కూడా చేరుతుందని ఈ సినిమా పైన హాట్ చర్చ సాగిస్తున్నారు ఫ్యాన్స్.

Samantha : శోభితతో నాగచైతన్య డేటింగ్? ఫైర్ అయిన సమంత..

హంగూ ఆర్భాటలేవీ లేకుండానే తన సినిమాలను పట్టాలెక్కించేస్తున్నాడు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్. కొవిడ్ గ్యాప్, కొడుకు ఇష్యూతో షారుఖ్ కెరీర్ కి దాదాపు 4 ఇయర్స్ బ్రేకులు పడటంతో, హైస్పీడ్ లో బాద్షా ఇప్పుడు పరుగులు పెడుతున్నాడు. కొవిడ్ ముందు స్టార్ట్ అయిన పఠాన్ తో పాటు, తర్వాత ప్రాజెక్ట్స్ అన్నింటి పైన ఈ హీరో కాన్సట్రేషన్ పెంచాడు. 2023 జనవరి 25న పఠాన్ రిలీజ్ కి రెడీ చేయగా, షారూక్ లిస్ట్ లో అట్లీ డైరెక్షన్ లో్ జవాన్, రాజ్ కుమార్ హీరాణితో డుంకీ, సల్మాన్ ఖాన్ కాంబోలో టైగర్ 3, మాధవన్ రాకెట్రీ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి డాన్ 3 కూడా చేరగా అఫిషియల్ అనౌన్స్ మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బాద్షా ఫాన్స్. వీళ్లిద్దరి కాంబోలో ఇప్పుడు సినిమా పడితే కచ్చితంగా బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు.