Jr NTR: డొనేట్ ఏ మీల్.. సేవలో తారక్ ఫ్యాన్స్ అరుదైన రికార్డ్!

గతంలో కంటే సినీ స్టార్స్ సేవా కార్యక్రమాలలో ఈ మధ్య కాలంలో చాలా ముందుంటున్నారు. తమ దృష్టికి వచ్చిన అభిమానులు, ప్రజల కష్టాలను తమకి తోచినంతగా స్పందించి ఆదుకుంటున్నారు. ఇక, అభిమాన సంఘాలు కూడా తమ హీరోలకు సంబంధించిన స్పెషల్ డేస్ ను ఘనంగా సెలబ్రేట్ చేస్తూ భారీగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Jr NTR: డొనేట్ ఏ మీల్.. సేవలో తారక్ ఫ్యాన్స్ అరుదైన రికార్డ్!

Jr Ntr

Jr NTR: గతంలో కంటే సినీ స్టార్స్ సేవా కార్యక్రమాలలో ఈ మధ్య కాలంలో చాలా ముందుంటున్నారు. తమ దృష్టికి వచ్చిన అభిమానులు, ప్రజల కష్టాలను తమకి తోచినంతగా స్పందించి ఆదుకుంటున్నారు. ఇక, అభిమాన సంఘాలు కూడా తమ హీరోలకు సంబంధించిన స్పెషల్ డేస్ ను ఘనంగా సెలబ్రేట్ చేస్తూ భారీగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలా మొదలైందే డొనేట్ ఏ మీల్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మొదలు పెట్టిన ఈ సేవా కార్యక్రమం ఇప్పుడు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లుగా పోస్టర్లు విడుదల చేశారు.

Jr NTR: చిల్ మూడ్ నుండి వర్క్ మూడ్‌లోకి ఎన్టీఆర్.. ఇక దూకుడే!

ఆకలితో బాధపడే అనాథల కోసం జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు సంబంధించిన టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యులు కొంత మంది కలిసి రెండేళ్ల క్రితం ‘డొనేట్ ఏ మీల్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫుట్‌పాత్‌ల మీద జీవిస్తూ.. అన్నం కోసం ఎదురు చూసే వాళ్ల కోసం టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు, 133 లొకేష‌న్లు, 600 రోజుల పాటు టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 600 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ట్రస్ట్ సభ్యులు పోస్టర్లు విడుదల చేశారు.

Jr NTR: తారక్ న్యూ లుక్.. ఫోటో నెట్టింట వైరల్!

ప్ర‌తిరోజూ డొనేట్ ఏ మీల్ త‌రుఫున ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించిన తార‌క్ ఫ్యాన్స్ సాధించిన ఈ రికార్డు మ‌రో సంచ‌ల‌నం కానుంది. క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న సమయంలో పేదలు, రోడ్ల మీద జీవనం సాగించే భిక్షాటకుల ఆకలి బాధలు చూసి టీమ్ తారక్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టగా తాజాగా ఇది 600 వందల రోజులు పూర్తి చేసుకుంది. ముందుగా ఏపీలోని చిత్తూరు జిల్లాలో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు ఐదు రాష్ట్రాలు, 133 లొకేషన్లకు విస్తరించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ త‌మ వంతుగా అన్న‌దానం చేస్తున్నారు. ఇందుకు ఒక్కో అభిమాని త‌మ ప‌రిధిలో వీలున్నంత మేర డొనేట్ ఏ మీల్ అనే నినాదం అందుకుని ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు.

Jr NTR: ఇక జాతరే.. ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్న తారక్ మూవీ లైనప్

ఆంధ్రా, తెలంగాణ‌, బెంగ‌ళూరు, చెన్నై లాంటి మ‌హా న‌గ‌రాలలో వివిధ లొకేషన్లతో పాటు ఐదు రాష్ట్రాలలో చిన్న చిన్న పట్టణాలు, జిల్లా హెడ్ క్వార్ట్రర్లలో ఈ సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి ప‌లువురి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యులు, అభిమానులు వాళ్ళ పరిధిలో.. వాళ్ళకి తోచినంత డబ్బు జమ చేసి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చంతా భరించడం విశేషం. కాగా.. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్ లో కూడా కొనసాగిస్తామని.. మనిషి ఆకలి తీర్చడాన్ని మించిన ఆనందం ఇంకెక్కడ దొరుకుంటుందని టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యులు ఆనందంగా చెప్తున్నారు.