Dongalunnaru Jaagratha : దొంగలున్నారు జాగ్రత్త మూవీ రివ్యూ.. గంటన్నరలో ఏదో చెప్పాలని ట్రై చేశాడు కానీ..

దొంగలున్నారు జాగ్రత్త ట్రైలర్ రిలీజ్ చేశాక ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీ ఉంటుందని జనాలు ఊహించారు. సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ భారీగానే చేసింది. ఇందులో...........

Dongalunnaru Jaagratha : దొంగలున్నారు జాగ్రత్త మూవీ రివ్యూ.. గంటన్నరలో ఏదో చెప్పాలని ట్రై చేశాడు కానీ..

Dongalunnaru Jagratha Movie Review

Dongalunnaru Jaagratha :  కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా, ప్రీతీ అస్రాని హీరోయిన్ గా కొత్త దర్శకుడు సతీష్ త్రిపుర దర్శకత్వంలో గురు ఫిలిమ్స్ బ్యానర్ పై సునీత తాటి నిర్మించిన సినిమా ‘దొంగలున్నారు జాగ్రత్త’. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. గతంలో మత్తువదలరా సినిమాతో మెప్పించిన శ్రీ సింహా ఆ తర్వాత తెల్లారితే గురువారం సినిమాతో పర్వాలేదనిపించాడు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక దొంగలున్నారు జాగ్రత్త ట్రైలర్ రిలీజ్ చేశాక ఇదేదో సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీ ఉంటుందని జనాలు ఊహించారు. సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ భారీగానే చేసింది. ఇందులో సముద్రఖని ఓ ముఖ్య పాత్రలో చేశారు. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా అవ్వడంతో ఈ సారి శ్రీ సింహా మంచి విజయం సాధిస్తాడు అనుకున్నారు. కానీ థియేటర్ కి వెళ్లి చూస్తే మొత్తం సీన్ రివర్స్ అయింది.

కథలోకి వస్తే శ్రీ సింహా ఒక దొంగ. ఒక కారులో ఉన్న వస్తువులు దొంగతనం చేయడానికి ట్రై చేస్తూ కారులో ఇరుక్కుపోతాడు. ఎంత ప్రయత్నించినా ఆ కారులో నుంచి బయటకి రాలేకపోతాడు. ఒక రెండు రోజులు ఫుడ్, వాటర్ లేకుండా ఆ కారులోనే ఉండిపోతాడు. కారులో ఉన్న సిస్టమ్ కి ఒక కాల్ వచ్చి శ్రీ సింహాతో మాట్లాడుతుంది. ఇదంతా కావాలనే ప్లాన్ చేసినట్టు శ్రీ సింహాకి అర్ధమవుతుంది. అయితే ఎవరు ప్లాన్ చేశారు, శ్రీ సింహా ఏం దొంగతనాలు చేశాడు? ఏ దొంగతనం వల్ల ఎవరికి నష్టం కలిగింది? క్లైమాక్స్ లో శ్రీ సింహా ఎలా బయటకి వచ్చాడు, వచ్చాక ఏమవుతుంది అనేది థియేటర్లో చూడాల్సిందే.

Aa Ammyi Gurinchi Meeku Cheppali Review : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ

ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ కంటే నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. సినిమాలో చెప్పుకోదగ్గ పాజిటివ్ పాయింట్స్ శ్రీ సింహా నటన, కెమెరామెన్ పనితనం, సముద్రఖని నటన, సముద్రఖని శుభలేఖ సుధాకర్ చెప్పిన డబ్బింగ్. సినిమా కేవలం గంటన్నర మాత్రమే ఉంది. అయితే సినిమా చూశాకా ఇదే చాలా సేపు ఎక్కువయింది అని ఆడియన్స్ ఫీల్ అవుతారు. సినిమాలో దాదాపు 95 శాతం ఒకే కారులో తీశారు. గంటన్నరలో గంట 20 నిముషాలు శ్రీ సింహానే తెరపై కనపడతాడు. దీంతో ప్రేక్షకులకి బోరింగ్ అనిపించింది. కొన్ని సన్నివేశాలు న్యాచురాలిటీకి దూరంగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు చాలా సీరియస్ గా తీసినా ప్రేక్షకుడు అన్ని ముందే కనిపెట్టేస్తాడు, అవి అంత సీరియస్ గా కూడా అనిపించవు. హీరోయిన్ సినిమా మొత్తం మీద 10 నిముషాలు కూడా కనపడదు. ఈ సినిమాతో దర్శకుడు సినిమాని తెరకెక్కించడంలో తన పనితనం తెలియచేసినా కథ, కథనంలో మాత్రం తేలిపోయాడు. సినిమా అంతా చూశాక దొంగలకు దొంగతనం చేయొద్దు అని మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇక టైటిల్ కి, సినిమా కంటెంట్ కి జస్టిఫికేషన్ అవ్వలేదు. మొత్తానికి ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి.