Akshay Kumar : సినిమాలపై విమర్శలు చేయెద్దు.. మోడీ వార్నింగ్, అక్షయ్ థ్యాంకింగ్!

బాలీవుడ్ సినిమాల పై బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు పై చర్యలు తీసుకున్న ప్రధాని. మోడీ తీసుకున్న చర్యలకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశాడు.

Akshay Kumar : సినిమాలపై విమర్శలు చేయెద్దు.. మోడీ వార్నింగ్, అక్షయ్ థ్యాంకింగ్!

Akshay Kumar

Akshay Kumar : ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లోని ప్రతి సినిమా విమర్శలు ఎదురుకుంటూ, వివాదంలో చిక్కుకుంటుంది. ఇండియన్ ఆర్మీని తక్కువ చేస్తున్నట్లు ఉంది అంటూ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ని, హిందూ ధర్మాలను కించపరిచేలా ఉంది అంటూ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ని.. ఇలా ప్రతి సినిమా విమర్శలకు గురు అవుతూ వస్తుంది. అయితే ఈ విమర్శలు ప్రేక్షకులు, మత సంఘాలతో పాటు రాజకీయ నాయకులు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తూ వివాదాలకు దారి తీస్తున్నారు.

Ram Charan-Akshay Kumar : రామ్ చరణ్, అక్షయ్ కుమార్ ఒకే వేదికపై..

ఇటీవల పఠాన్ విషయంలో చాలా మంది బీజేపీ నాయకులు రోడ్ పైకి వచ్చి మరి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్ కి చెందిన ఒక మినిస్టర్.. సినీ నిర్మాతలను బెదిరించడం రాజకీయం పరంగా చర్చనీయాంశం అయ్యింది. దీని పై ప్రధాని మోడీ స్పందిస్తూ ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో బీజేపీ నాయకులను హెచ్చరించినట్లు తెలుస్తుంది. అనవసరపు విషయాల పై విమర్శలు చేస్తూ మీడియాలో నిలవకండి అంటూ పార్టీ లీడర్స్ కి మోడీ వార్నింగ్ ఇచ్చాడు. మోడీ తీసుకున్న చర్యలకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశాడు.

మేము ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్నాము. కానీ ఎవరో ఒకరు చేసిన అనవసరపు వ్యాఖ్యలు వల్ల వివాదాలు తలెత్తుతున్నాయి. దేశంలో ప్రధాని మోడీ అతిపెద్ద ప్రభావశీల. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కొంత అయినా మార్పు తీసుకువస్తే సినీ పరిశ్రమకి మేలు కలుగుతుంది. ఇటువంటి చర్యలు తీసుకున్నందుకు ఆయనకి ధన్యవాదాలు అంటూ వెల్లడించాడు. కాగా అక్షయ్ ప్రస్తుతం రెండు సౌత్ రీమేక్స్ లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి ఆకాశం నీ హద్దురా, రెండోది మలయాళ సినిమా డ్రైవింగ్ లైసెన్స్. వీటితో పాటు ఓ మై గాడ్ 2, ఛత్రపతి శివాజీ జీవిత కథ, తాజాగా టైగర్ ష్రాఫ్ తో కలిసి మరో సినిమాలో నటించేందుకు సిద్ధం అయ్యాడు.