కంగనాకు అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చిన దిల్జిత్

కంగనాకు అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చిన దిల్జిత్

Kangana Ranaut: దిల్జిత్ వర్సెస్ కంగనా రనౌట్ ట్వీట్‌లు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ సారి కంగనా వార్తల్లో ఉండటానికి మంచి టాపిక్ దొరికినట్లు అయింది. రైతు ఆందోళనల పట్ల స్పందిస్తున్న పంజాబీ దిల్జిత్ దోసంజాపై విమర్శలు చేస్తున్న కంగనా.. శుక్రవారం సాయంత్రం నుంచి వరుస ట్వీట్లు చేస్తూనే ఉంది. హ్యాష్ ట్యాగ్ (#Diljit_Kitthe_aa)తో పోస్టు చేసింది.

యాక్టర్‌ను పాయింట్ అవుట్ చేస్తూ.. చేసిన ట్వీట్లకు దిల్జిత్ పెద్దగా రెస్పాండ్ అవలేదు. కంగనా అంతకంటే ముందు చేసిన ట్వీట్లలో రైతులను యాంటీ నేషనల్స్, ఇస్లామీ వాదులని, యాంటీ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ, లెఫ్ట్ మీడియా వారిని తప్పుదోవ పట్టిస్తుందంటూ అభివర్ణించారు.

సాయంత్రం సమయంలో చేసిన ట్వీట్లో ‘మళ్లీ నేను చెప్పింది నిజమే. ఈ విషయం ఇవాళ కోర్టులో ఉంటే మాత్రం నిరూపితమయ్యేది. ఈసారి తిట్టేముందు, వేధించే ముందు, లేదా నన్ను టార్గెట్ చేసే ముందు గుర్తుపెట్టుకోండి. మీరందరూ మాట్లాడేది మీ తండ్రులకు తల్లితో అని..’ అని పోస్టు చేసింది.

అదే హ్యాష్ ట్యాగ్‌తో కంగనా రెండు ట్వీట్లు చేసింది. తన షెడ్యూల్ గురించి పోస్టు చేసి మళ్లీ దిల్జిత్ ఎక్కడ అంటూ పోస్టు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరూ ఆయన్నే వెతుకుతున్నారంటూ ట్వీట్ చేసింది. ‘ఇవాళ హైదరాబాద్‌లో 12గంటల పాటు పనిచేసిన తర్వాత చెన్నైకు బయల్దేరా. చెన్నైలో ఓ చారిటీ ఈవెంట్ కోసం బయల్దేరా. యల్లో డ్రెస్ లో ఎలా ఉన్నా.. దిల్జిత్ ఎక్కడున్నాడు అందరూ అతణ్నే వెతుకుతున్నారు’ అని పోస్టు పెట్టారు.

దిల్జిత్ ఎట్టకేలకు ట్వీట్ కు రెస్పాండ్ అయ్యాడు. ఉదయాన్నే లేచా.. జిమ్ కు వెళ్లా.. రోజంతా పనిచేసుకున్నా.. ఇప్పుడు పడుకుందామనుకుంటున్నా.. అని ట్వీట్ చేశాడు. కంగనా రోజంతా ట్వీట్లు చేసుకుని దిల్జిత్ ఎక్కడాఎక్కడా అని ట్వీట్ చేస్తుంటే దిల్జిత్ నా పనిలో నేనున్నా అంటూ ట్వీట్ చేసింది.