Samantha : థంబ్‌నైల్స్‌తో మాకు సంబంధం లేదు.. సమంత కేసులో స్పందించిన డాక్టర్ సీఎల్ వెంకట్‌రావు

సమంత పై ఇంటర్వ్యూలు ఇచ్చిన డాక్టర్‌ సీఎల్‌ వెంకట్‌రావుపై కోర్టులో పరువు నష్టం దావా పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కూకట్‌పల్లి కోర్టు సమంత ప్రతిష్టకు నష్టం

Samantha : థంబ్‌నైల్స్‌తో మాకు సంబంధం లేదు.. సమంత కేసులో స్పందించిన డాక్టర్ సీఎల్ వెంకట్‌రావు

Samantha (2)

Samantha :  సమంత-నాగచైతన్య విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో సమంతని ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఆ ట్రోల్స్ కి సమంత ఘాటుగా సమాధానం ఇచ్చింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సమంత విడాకుల విషయంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఇషటమొచ్చినట్టు థంబ్‌నైల్స్‌ని పెట్టి వీడియోలని ప్రసారం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సమంత మూడు యూట్యూబ్ ఛానల్స్‌తో పాటు t డాక్టర్ సీఎల్ వెంకట్‌రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ వీడియోలను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

Bigg Boss 5 : పేడలో పడి దొర్లాడి టాస్క్ గెలిచాడు సరే.. కెప్టెన్ అవుతాడా??

తాజాగా ఈ వ్యవహారంపై డాక్టర్ సీఎల్‌ వెంకట్‌రావు స్పందించారు. మేము కేవలం ఇంటర్వ్యూలో కంటెంట్‌ మాత్రమే ఇస్తాము. కంటెంట్ ఇచ్చేది తామే అయినా ఈ థంబ్‌నైల్స్‌ ఇచ్చేవాళ్లు వేరే ఉంటారని తెలిపారు. థంబ్‌నైల్స్‌ విషయంలో మాకు ఎలాంటి సంబంధము ఉండదు అని తెలిపారు. ఈ థంబ్‌నైల్స్‌ ఇచ్చేందుకు ఎస్‌ఈవో అనే టీమ్‌ పని చేస్తుందని, వారు ఎలాంటి థంబ్‌నైల్స్‌ పెడతారో ఎలాంటి ఫోటోలు వాడతారో మాకు చెప్పరు అని వివరించారు. కాబట్టి ఆ థంబ్‌నైల్స్‌కి మాకు ఎలాంటి సంబంధం లేదు అని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు అయిపోయిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల దీనిపై సమంత తరపున ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.