‘శేఖర్’ గా డా.రాజ ‘శేఖర్’..

‘శేఖర్’ గా డా.రాజ ‘శేఖర్’..

Dr. Rajasekhar: పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రముఖ నటుడు, యాంగ్రీ స్టార్, అగ్రెసివ్ హీరో, డా.రాజశేఖర్ పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 4).. ‘గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాలతో వరుస విజయాలు ఖాతాలో వేసుకున్న రాజశేఖర్ కొత్త సినిమా వివరాలు బర్త్‌డే సందర్భంగా తెలియజేశారు.

ఇటీవలే కోవిడ్ నుండి కోలుకున్న రాజశేఖర్.. ఆ సమయంలో అండగా నిలిచిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షక దేవుళ్ల మద్దతు వల్లే పుట్టిన రోజునాడు కొత్త సినిమాను ప్రారంభించగలుగుతున్నానని ట్వీట్ చేశారు.

రాజశేఖర్ కొత్త సినిమాకు ‘శేఖర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. Man With The Scar అనేది పవర్‌ఫుల్ ట్యాగ్ లైన్ పెట్టారు. రాజశేఖర్ నటిస్తున్న 91వ సినిమా ఇది. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

యాంగ్రీ స్టార్ ఫస్ట్ టైమ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు లలిత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు..

SHEKAR