Ramarao : ఏడు సంవత్సరాలుగా 2500 మందికి పైగా పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేశాం.. మహేష్ గారి వల్లే..

ఈ ఈవెంట్ లో ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్ రామారావు మాట్లాడుతూ.. 2015లో నిర్మాత యెర్నేని నవీన్ గారి ద్వారా నమ్రత గారిని, మహేష్ గారిని కలిసాము. ఏడు సంవత్సరాలుగా 2500 మందికి పైగా........

Ramarao : ఏడు సంవత్సరాలుగా 2500 మందికి పైగా పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేశాం.. మహేష్ గారి వల్లే..

Ramarao

 

Sarkaru Vaari Paata :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

Ram Lakshman : మీ హీరోని బాగా కష్టపెట్టాం..

ఈ ఈవెంట్ లో ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్ రామారావు మాట్లాడుతూ.. 2015లో నిర్మాత యెర్నేని నవీన్ గారి ద్వారా నమ్రత గారిని, మహేష్ గారిని కలిసాము. ఏడు సంవత్సరాలుగా 2500 మందికి పైగా పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేసి బతికించాము. ఇదంతా మహేష్ బాబు గారి సపోర్ట్ వల్లే. ఆయన అడాప్ట్ చేసుకున్న విలేజ్ లో క్యాంపులు నిర్వహిస్తాము. కరోనాలో బుర్రిపాలెంతో పాటు పక్కన ఉన్న గ్రామాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ చేశాము. ఇదంతా మహేష్ గారి వల్లే. మహేష్ గారు పిల్లల గుండె జబ్బుల గురించి బాగా ప్రచారం చేశారు. ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్న పిల్లలకి మహేష్ గారంటే చాలా ఇష్టం. వాళ్లందరికీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పెషల్ టెలికాస్ట్ ఏర్పాటు చేశాం.