Divi Vadthya: ప్రభాస్‌తో కప్పు కాఫీ తాగినా చాలు.. దివి లవ్ ప్రపోజల్!

సొట్టబుగ్గల సుందరికి మన రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పిచ్చి ప్రేమ ఉందట. మిర్చి లాంటి ప్రభాస్ తో ఒక్క కాఫీ తాగినా చాలంటూ తన లవ్ ప్రపోజల్ బయటపెట్టేసింది. తాజాగా ఓ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న దివి తన మనసులో భావాన్ని పంచుకుంది.

Divi Vadthya: ప్రభాస్‌తో కప్పు కాఫీ తాగినా చాలు.. దివి లవ్ ప్రపోజల్!

Divi Vadthya

Divi Vadthya: పొడవాటి సౌదర్యం.. చేపలాంటి కళ్ళు.. నవ్వితే సొట్ట పడే బుగ్గలు.. నడుస్తుంటే కుర్రాళ్ళ గుండెల్లో అడుగుల చప్పుడు.. ఇది దివి వాద్య. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటినటుల్లో దివి వాద్య పేరు ముందు వరసలో ఉంటుంది. బిగ్ బాస్ ముందు దివి పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఆ షోతో అందరినీ కట్టిపడేసింది. ఇక ఈ షో నుండి భయటకు వచ్చాక దివి అటు టీవీ షోలలో ఇటు వెబ్ సిరీస్ లలో సందడి చేస్తోన్న దివి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలలో కీ రోల్స్ తో పాటు హీరోయిన్ గా కూడా అవకాశాలను పడుతుంది.

కాగా, ఈ సొట్టబుగ్గల సుందరికి మన రెబల్ స్టార్ ప్రభాస్ అంటే పిచ్చి ప్రేమ ఉందట. మిర్చి లాంటి ప్రభాస్ తో ఒక్క కాఫీ తాగినా చాలంటూ తన లవ్ ప్రపోజల్ బయటపెట్టేసింది. తాజాగా ఓ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న దివి తన మనసులో భావాన్ని పంచుకుంది. హీరో ప్రభాస్‌ అంటే ఎంతో ఇష్టమని, ఒక రకంగా చెప్పాలంటే ఆయనంటే క్రష్‌ అని చెప్పుకొచ్చింది. మిర్చి సినిమాతో ప్రభాస్‌కు ఫ్యాన్‌ అయిపోయిన వాద్య.. అప్పటి నుంచి ఆయనకు ఐ లవ్‌ యూ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు కూడా చేస్తుందట.

అంతేకాదు ఆయన అవకాశం ఇవ్వాలే కానీ డేటింగ్‌కు కూడా వెళ్తానని మొహమాటం లేకుండా చెప్పేసింది. మొత్తం మీద ప్రభాస్ అంటే పడిచచ్చేంత ఇష్టం ఉందని చెప్పింది. దివి ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమాతో పాటు పుష్ప, సర్కారు వారి పాట సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.