Drishyam Movies : చైనీస్, కొరియా, జపాన్ సినిమాల్లో రీమేక్ అవ్వబోతున్న దృశ్యం..
మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు దృశ్యం, దృశ్యం 2. ఈ రెండు సినిమాలు మలయాళంలో భారీ విజయం సాధించాయి. ఇప్పటికే ఈ సినిమాలని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ లో రీమేక్ చేశారు. రీమేక్ చేసిన.............

Drishyam Movies : మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు దృశ్యం, దృశ్యం 2. ఈ రెండు సినిమాలు మలయాళంలో భారీ విజయం సాధించాయి. ఇప్పటికే ఈ సినిమాలని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ లో రీమేక్ చేశారు. రీమేక్ చేసిన అన్ని చోట్ల కూడా మంచి విజయాలు సాధించాయి ఈ సినిమాలు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాలకి మంచి అభినందనలు దక్కాయి.
అయితే ఈ దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఇప్ప్పుడు మన దేశం దాటి బయటి దేశాల భాషల్లో రీమేక్ అవ్వబోతున్నాయి. పనోరమా స్టూడియోస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ దృశ్యం, దృశ్యం 2 సినిమాలకు బయటి దేశాల్లోని భాషల్లో రీమేక్ చేయడానికి రీమేక్ హక్కులు కొనుగోలు చేశాయి. త్వరలోనే ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, కొరియా భాషల్లో దృశ్యం, దృశ్యం 2 సినిమాలని రీమేక్ చేయబోతున్నట్టు ఆ నిర్మాణ సంస్థ ప్రకటించింది.
Chandan K Anand : పఠాన్ వాస్తవానికి దూరంగా ఉంది.. పఠాన్, బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు..
ఇప్పటికే పనోరమా సంస్థ దృశ్యం 2 సినిమాని హిందీలో రీమేక్ చేసింది. ఇప్పుడు ప్రపంచంలోని పలు భాషల్లో నిర్మించనుంది. హాలీవుడ్ లో కూడా ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే పలు ఇండియన్ సినిమాలు ప్రపంచ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తూ ప్రపంచ సినీ చూపుని మన వైపుకు తిప్పుకున్నాయి. ఇప్పుడు ఏకంగా మన సినిమాలు వేరే దేశాల్లోని భాషల్లో రీమేక్ చేయడం అంటే సరికొత్త సాహసమే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు అక్కడి భాషల్లో డబ్బింగ్ చేసి సినిమాలు రిలీజ్ చేశాం. ఎక్కడో కొన్ని సినిమాలు ఎక్కడో ఒక చోట మాత్రమే రీమేక్ అయ్యాయి. కానీ ఇప్పుడు దృశ్యం, దృశ్యం 2 సినిమాలు పలు భాషల్లో రీమేక్ అవ్వడం గొప్ప విషయమని చెప్పొచ్చు.
“We have also acquired the rights of #Chinese language remake of #Drishyam2. We are now in negotiations to produce the film in #Korea, #Japan and #Hollywood,” Panorama states in an official media statement.
— taran adarsh (@taran_adarsh) February 8, 2023