Akhanda – Drushyam 2 : దసరాకి దబిడి దిబిడే..

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’, విక్టరీ వెంకటేష్ ‘దృశ్యం 2’ సినిమాలు దసరా సీజన్ మీద కన్నేశాయి..

Akhanda – Drushyam 2 : దసరాకి దబిడి దిబిడే..

Akhanda Drushyam 2

Akhanda – Drushyam 2: కోవిడ్ కారణంగా అన్ని రంగాలతో పాటు సినిమా పరిశ్రమ కూడా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది. షూటింగ్స్ లేక సినీ కార్మికులు, రిలీజులు కాక దర్శక నిర్మాతలు చాలా ఇబ్బందులు పడ్డారు. పాండమిక్ తర్వాత ‘క్రాక్’ సినిమా సక్సెస్ అవడంతో మిగతా సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.

Manchu Manoj : చిన్నారి ఘటనపై ఎమోషనల్ అయిన మంచు మనోజ్..

కట్ చేస్తే.. ఇంతలో సెకండ్ వేవ్ దెబ్బేసింది. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. వేరే దారిలేక కొన్ని సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. ఎట్టకేలకు షూటింగులు స్టార్ట్ అయ్యాయి. ప్రేక్షకులు మెల్లగా థియేటర్లకొస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘సీటీమార్’ తో మంచి సినిమాను ఆడియన్స్ ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది.

Seetimaar : నా ఫ్రెండ్ సినిమా బ్లాక్‌బస్టర్..

చిన్న సినిమాలు ఒకొక్కటిగా రిలీజ్ డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి కానీ పాన్ ఇండియా సినిమాలు, పెద్ద చిత్రాలు మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఇటీవల ‘నారప్ప’ మూవీని ఓటీటీలో విడుదల చేసిన విక్టరీ వెంకటేష్.. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసిన ‘దృశ్యం 2’ ని డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారానే రిలీజ్ చెయ్యబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ క్లారిటీ మాత్రం రాలేదు.

Krishnam Raju : కాలుజారి పడ్డ కృష్ణంరాజు.. అపోలో ఆస్పత్రిలో సర్జరీ..

అయితే వెంకీతో పాటు బాలయ్య కూడా దసరా సీజన్ మీద కన్నేశారని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. వెంకటేష్ నటించిన ‘దృశ్యం 2’ అక్టోబర్ 13న రిలీజ్ కానుందని తెలుస్తోంది. తర్వాత రోజైన అక్టోబర్ 14న బాలయ్య ‘అఖండ’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం..

NBK 107 : బాలయ్య కోసం పవర్‌ఫుల్ టైటిల్..!