దక్షిణాది సినిమాలు డబ్బింగ్ చేసుకుని రిలీజ్ చేయాలని బాలీవుడ్ థియేటర్ల ప్లాన్

దక్షిణాది సినిమాలు డబ్బింగ్ చేసుకుని రిలీజ్ చేయాలని బాలీవుడ్ థియేటర్ల ప్లాన్

Telugu Cinema: సినిమా థియేటర్లు క్లోజ్ అయిపోయాయి. అటువైపు సినిమా షూటింగులు కూడా లేవు. ఇక థియేటర్లు ఇప్పటికిప్పుడు ఓపెన్ చేస్తే టీవీల్లో వేయడానికి సినిమాలెక్కడివి. దీంతో బాలీవుడ్ థియేటర్లకు దక్షిణాది సినిమాలే దిక్కయ్యాయి. హిందీలోకి డబ్బింగ్ అయిన తెలుగు, తమిళ సినిమాలు టీవీల్లో హిట్ అవడంతో వాటినే మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

ఈ మేరకు ఇండియన్ ఫిల్మ్స్ లోని తెలుగు సినిమాలను డబ్బింగ్ చేసేందుకు శాటిలైట్ హక్కులను కొనుక్కుంటున్నారు. టాప్ స్టార్స్ అయిన రామ్ చరణ్, అల్లు అర్జున్, ధనుష్ లాంటి హీరోల సినిమాలు ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో రిలీజ్ చేసుకుంటున్నారు. దాదాపు బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యే థియేటర్లన్నీ రెండు నెలల పాటు ఈ సినిమాలతోనే గడిపేయనున్నాయి.

థియేటర్ ఓనర్లు సౌత్ ఇండియా సినిమాల గురించి పోటీపడటం మొదలుపెట్టారట. ఆడియెన్స్ చూపిస్తున్న ఆసక్తికి బాలీవుడ్ సినిమాలను వెనక్కుపెట్టేస్తున్నారట. టైటిల్స్ మధ్యలో విశాల్ యాక్షన్ సినిమాలు, ధనుష్ అసురన్ సినిమాలు వంటి ట్రైలర్లు వేస్తున్నారట కొందరు.

షూటింగ్స్ ఎక్కువ లేకపోవడం, ఉన్న కొన్ని సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయిపోవడంతో థియేటర్లకు కొత్త సినిమాలే లేకుండా పోయాయ్. ఇప్పటికే యూట్యూబ్ ఛానెల్స్‌లో హిట్ అయిన అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా డబ్బింగ్ వర్షన్ (సూర్య -ద సోల్జర్) లాంటివి బొనాంజాగా మారాయి.

ముంబై, అహ్మదాబాద్, ఇండోర్, కోల్ కతా, జలంధర్ లాంటి ప్రాంతాల్లో వలస వచ్చిన వారు, కాలేజీ స్టూడెంట్లు దక్షిణాది సినిమాలకే ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. లోకల్ లాంగ్వేజి సినిమాలు, హిందీ సినిమాలతో పోలిస్తే 30శాతం టిక్కెట్ రేట్ తక్కువగానే ఉంటుంది ఈ సినిమాలకు. బాలీవుడ్ సినిమాలు రిలీజ్ చేయడం లేట్ అయితే ఆ అవకాశాన్ని వేరొకరు వాడేసుకుంటారని అంటున్నారు ఎగ్జిబిటర్లు.