Srinivasa Murthi : టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నుమూత..

టాలీవుడ్ లో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ఉదయం సినీ పరిశ్రమ రెండు విషాదకర వార్తలు వినాల్సి వచ్చింది. సీనియర్ హీరోయిన్ జమున కన్నుమూసిన సంగతి ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజాగా ఇండస్ట్రీకి సంబంధించిన మరో వ్యక్తి మరణ వార్త అందర్నీ షాక్ కి గురి చేసింది.

Srinivasa Murthi : టాలీవుడ్ లో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొంత కాలంగా అలనాటి నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు స్వర్గస్తులు అవుతూ వస్తున్నారు. ఈరోజు ఉదయం సినీ పరిశ్రమ రెండు విషాదకర వార్తలు వినాల్సి వచ్చింది. అలనాటి తార, విలక్షణ నటి, సీనియర్ హీరోయిన్ జమున కన్నుమూసిన సంగతి ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజాగా ఇండస్ట్రీకి సంబంధించిన మరో వ్యక్తి మరణ వార్త అందర్నీ షాక్ కి గురి చేసింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీనివాస మూర్తి కన్నుమూశాడు.

Jamuna : సినిమాలోకి రాకముందే సావిత్రి, జమునల స్నేహం..

తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పి ఇండస్ట్రీలో గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఒక స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. గుండె సంబంధింత సమస్యలు ఉన్న శ్రీనివాస మూర్తి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచాడు. సడన్ గా గుండెపోటు రావడంతో అయన మరణించినట్లు తెలుస్తుంది. ఇక శ్రీనివాస మూర్తి మరణ వార్త విన్న పలువురు హీరోలు మరియు తోటి డబ్బింగ్ ఆర్టిస్ట్ లు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస లాంటి గొప్ప ఆర్టిస్ట్ కొల్పడం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ తమ విచారం వ్యక్తం చేస్తున్నారు.

కాగా శ్రీనివాస మూర్తి తన డబ్బింగ్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్టు సినిమాల్లో స్టార్ హీరోలకు తన గాత్రాన్ని అందించాడు. సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్ ఇలా ఎంతో మంది స్టార్ హీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పేది శ్రీనివాస మూర్తి. ప్రతి సినిమాలో ఆ పాత్రకి తగట్టు, ఆ సన్నివేశానికి తగట్టు తన గొంతుని సవరించి పాత్రలోని ఎమోషన్ ని గాత్రంలోనే చూపించే గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి. గతంలో ఒక ఇంటర్వ్యూలో శ్రీనివాస మూర్తి.. తాను డబ్బింగ్ చెప్పిన హీరోలు అందరి డైలాగ్స్ ని చెప్పిన ఒక వీడియో నెట్టింట బాగా హల్ చల్ చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు