Liger Movie : లైగర్ కోసం వెయిట్ చేస్తున్నాను.. ట్విట్టర్ లో విజయ్, దుల్కర్ ఇంట్రెస్టింగ్ చాట్

ఈ సినిమాకి విజయ్ నిర్మాత కావడంతో అన్ని తానై ప్రమోషన్స్ చేశాడు. స్టార్ సెలబ్రిటీలందరితో 'పుష్పక విమానం' సినిమాని ప్రమోట్ చేయించాడు. ఈ సినిమాకి స్టార్స్ అంతా విషెష్ తెలిపారు. ఇదే

Liger Movie : లైగర్ కోసం వెయిట్ చేస్తున్నాను.. ట్విట్టర్ లో విజయ్, దుల్కర్ ఇంట్రెస్టింగ్ చాట్

Liger

Liger Movie :  రౌడీ హీరో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘పుష్పక విమానం’ సినిమా నిన్న థియేటర్ల లో విడుదల అయింది. ఈ సినిమాకి విజయ్ నిర్మాత కావడంతో అన్ని తానై ప్రమోషన్స్ చేశాడు. స్టార్ సెలబ్రిటీలందరితో ‘పుష్పక విమానం’ సినిమాని ప్రమోట్ చేయించాడు. ఈ సినిమాకి స్టార్స్ అంతా విషెష్ తెలిపారు. ఇదే కోవలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాకి విషెస్ చెప్తూ ట్వీట్ చేశాడు.

Radheshyam : పూర్తయిన ‘రాధేశ్యామ్’ మ్యూజిక్..ఫస్ట్ సాంగ్ ఎప్పుడు??

అయితే సినిమా విడుదల అయ్యాక తన షూటింగ్ కోసం లాస్ ఏంజిల్స్ కి వెళ్ళాడు విజయ్. అక్కడ దిగిన తర్వాత దుల్కర్ చేసిన ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు. దుల్కర్ ట్వీట్ కి విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. నువ్వు నా సోదరుడి లాంటి వాడివి, నేను 16 గంటలుగా లాస్ ఏంజిల్స్ కి వెళ్లే ఫ్లైట్ లో ఉన్నాను. అందుకే ట్వీట్ చూడలేదు. నా టీమ్ ను వదిలి వచ్చాను అనే కలలో నుండి బయటకి వచ్చాను నీ ట్వీట్ చూసి అని పోస్ట్ చేశాడు. అంతే కాక అదే రోజు రిలీజ్ అయిన దుల్కర్ సినిమా ‘కురుప్’కి విషెష్ తెలిపాడు.

Bigg Boss 5 : కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కలిసొచ్చి బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా రవి

విజయ్ చేసిన ఈ ట్వీట్ కి దుల్కర్ స్పందించడం విశేషం. విజయ్ ట్వీట్ కి దుల్కర్ సల్మాన్ స్పందిస్తూ.. మనం ఒకరి కోసం ఒకరం సపోర్ట్ ఇచ్చుకుంటాం. లాస్ ఏంజిల్స్ లో షూటింగ్ ఎంజాయ్ చెయ్యి. నీ ‘లైగర్’ సినిమా కోసం నేను ఎదురు చూస్తున్నాను అని పోస్ట్ చేశారు. మలయాళ స్టార్ హీరో ఇలా ‘లైగర్’ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అని పోస్ట్ చేయడంతో విజయ్ అభిమానులు ఈ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు. విజయ్ రేంజ్ ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు.