Salute: ఓటీటీకి జై కొట్టిన దుల్కర్.. ‘సెల్యూట్’ నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్

మలయాళ యువనటుడు దుల్కర్ సల్మాన్ సౌత్ అన్ని బాషలలో పరిచయమే. ముఖ్యంగా తెలుగులో ఇప్పటికే మహానటి లాంటి స్ట్రైట్ సినిమాలతో బాగా దగ్గరయ్యాడు. దుల్కర్ డబ్బింగ్ సినిమాలతో పాటు రిలీజ్..

Salute: ఓటీటీకి జై కొట్టిన దుల్కర్.. ‘సెల్యూట్’ నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్

Salute

Salute: మలయాళ యువనటుడు దుల్కర్ సల్మాన్ సౌత్ అన్ని బాషలలో పరిచయమే. ముఖ్యంగా తెలుగులో ఇప్పటికే మహానటి లాంటి స్ట్రైట్ సినిమాలతో బాగా దగ్గరయ్యాడు. దుల్కర్ డబ్బింగ్ సినిమాలతో పాటు రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా తెలుగులో కొంత మార్కెట్ ఉంటుంది. తమిళంలో కూడా ప్రేక్షకులకు బాగా పరిచయమున్న దుల్కర్ సినిమాలకి బిజినెస్ పరంగా ఎలాంటి డోకా ఉండదు.

Salute Movie : దుల్కర్ డిఫరెంట్ థ్రిల్లర్ ‘సెల్యూట్’..

అయినా దుల్కర్ థియేటర్లను కాదని తన కొత్త సినిమాను నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నాడు. దుల్కర్‌ సల్మాన్‌ నటించిన సెల్యూట్‌ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 18న సోనీ LIVలో సెల్యూట్ నేరుగా విడుదల చేయనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.

Dulquer Salman : హే సినామిక ప్రీ రిలీజ్ ఈవెంట్

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆసక్తి కలిగించగా త్వరలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. డయానా పెంటీ కథానాయకి. చిత్రాన్నిదుల్కర్ సల్మాన్ తన హోమ్ బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్‌పై నిర్మించాడు. సొంత సినిమా కావడంతోనే మంచి రేటు దక్కడంతో ఓటీటీ రిలీజ్ కి ఇచ్చేసినట్లు కనిపిస్తుంది.