DVV: రేపు డివివి నుంచి రానున్న ‘పవర్’ఫుల్ అప్డేట్!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటించారు. తాజాగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ అదిరిపోయే అప్డేట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. తమ నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ భారీ అప్డేట్ డిసెంబర్ 4న ఉదయం 8.55 గంటలకు ఇవ్వనున్నట్లు నిర్మాత డివివి తెలిపారు.

DVV: రేపు డివివి నుంచి రానున్న ‘పవర్’ఫుల్ అప్డేట్!

DVV Entertainments Big Announcement Of Pawan Kalyan Movie Tomorrow

DVV: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ గ్లోబల్‌గా తన సత్తా చాటుతూ పలు అవార్డులను కైవసం చేసుకుంటూ వెళ్తోంది.

DVV Danayya : ఏపీ సినిమా టికెట్ రేట్లతో నిర్మాతలకు వర్కవుట్ అవ్వదు : ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత దానయ్య

ఇక ఈ సినిమా అందుకున్న భారీ విజయం తరువాత నిర్మాత డివివి దానయ్య నుంచి మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పటివరకు రాకపోవడంతో, ఆయన తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ అదిరిపోయే అప్డేట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది. తమ నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ భారీ అప్డేట్ డిసెంబర్ 4న ఉదయం 8.55 గంటలకు ఇవ్వనున్నట్లు నిర్మాత డివివి తెలిపారు.

RRR: 2022లోని వరల్డ్ టాప్ 50 సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’కి చోటు

అయితే ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కనుందని.. ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేయనుందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. మరి డివివి నుంచి రాబోయే ఆ పవర్‌ఫుల్ అప్డేట్ ఏమిటో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.