అదిగో కరోనా రక్కసీ.. చిట్టితల్లీ.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలంటూ కూతురికి నేర్పించిన హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్

  • Published By: sreehari ,Published On : April 4, 2020 / 06:43 AM IST
అదిగో కరోనా రక్కసీ.. చిట్టితల్లీ.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలంటూ కూతురికి నేర్పించిన హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్

హాలీవుడ్‌ స్టార్‌ డ్వేన్‌ జాన్సన్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జాన్సన్ నటించిన యాక్షన్ మూవీలు, అడ్వంచర్ మూవీలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ప్రత్యేకించి డ్వేన్ అభిమానుల కోసం డ్వేన్ జాన్సన్ సోషల్ మీడియ వేదికగా ఏదొక అంశంపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటాడు. ప్రపంచమంతా కరోనా వైరస్ విజృంభిస్తోంది.

ప్రపంచ దేశాలు కరోనా ప్రభావంతో వణికిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డ్వేన్ జాన్సన్ తన ఏడాది వయస్సు ఉన్న కుమార్తె గారాల పట్టీ Tianaకు నేర్పించాడు. బయట కరోనా రక్కసి ఉంది తల్లీ.. చేతులు శుభ్రంగా కడుక్కోవాలంటూ Moana మూవీ నుంచి పాట పాడుతూ సరదాగా నవ్వించాడు.(గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి!)

కుమార్తె Tianaతో కలిసి హ్యాపీ బర్త్ డే పాట పాడుతూ చిన్నారి చేతులను శుభ్రంగా కడుగుతున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశాడు జాన్సన్. 47ఏళ్ల ఫాస్ట్, ఫ్యూరియస్ నటుడు జాన్సన్.. Moana మూవీ నుంచి ‘యూఆర్ వెల్ కమ్’ పాట పాడుతూ స్నానానికి ముందు కుమార్తె టియానాకు చేతులను శుభ్రంగా కడుక్కోవాలో నేర్పించాడు. తండ్రీకూతుళ్లు చేతులు కడుగుతూ సరదాగా గడిపిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసి చేశాడు. ఈ వీడియోను పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే 42లక్షలకు పైగా లైక్స్, 62వేల 384 కామెంట్లు వచ్చాయి.