NTR: ప్రాణాపాయం నుండి కోలుకున్న తారక్ అభిమాని.. వీడియో కాల్ వైరల్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. ఒకరకంగా తారక్ ను ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఏపీలోని తూర్పు గోదావరి..

NTR: ప్రాణాపాయం నుండి కోలుకున్న తారక్ అభిమాని.. వీడియో కాల్ వైరల్!

Ntr

NTR: తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. ఒకరకంగా తారక్ ను ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన మురళి కూడా ఒకడు. అయితే.. మురళికి ఈ మధ్యనే రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రగాయాలపాలై ఆసుపత్రి పాలయ్యాడు. ఒకదశలో ఆయన ఆరోగ్యం విషమించినట్లు వైద్యులు చెప్పారు.

RGV: అందరూ బాగుండాలనుకొనే హీరోలే లేరు.. ఇండస్ట్రీకి పెద్ద అవసరం లేదు

దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు మురళి ఇష్టాయిష్టాలను తెలుసుకొని తీర్చే క్రమంలో ఎన్టీఆర్ తో మాట్లాడించాలని కోరుకున్నారు. ఎన్టీఆర్ అభిమాన సంఘానికి విషయం తెలపడంతో సభ్యులు ఆసుపత్రికి చేరుకొని వీడియో కాల్ ద్వారా మురళీని తారక్ తో మాట్లాడించారు. ఈ సందర్భంగా మురళికి ఎన్టీఆర్‌ ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న అభిమానులకు తనవంతు సాయం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక మురళీ ఆరోగ్య ఖర్చులకు గానూ ఎన్టీఆర్‌ అభిమానులు ఆయనకు రూ.2.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.

UnStoppable NBK: షోలో సందడి చేయాలా..! దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..!

ఇదంతా జరిగి రెండు వారాలు కాగా ప్రస్తుతం మురళీ తిరిగి కోలుకున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్న మురళీ ప్రాణాపాయం నుండి తప్పించుకోగా త్వరలోనే ఆసుపత్రి నుండి కూడా డిశ్చార్జ్ చేయనున్నారు. తనకు సాయం అందించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, తనతో మాట్లాడిన ధైర్యం నింపిన ఎన్టీఆర్ కు మురళీ కృతజ్ఞతలు చెప్తున్నాడు. మురళీ మళ్ళీ కోలుకోవడంతో ఆయన కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.