One Rupee Dosa: రూపాయికే దోసె.. కడుపు నిండా పెట్టేందుకే.. అభిమానంతోనే!

రజినీకాంత్ సినిమా విడుదల అంటే అభిమానులకు పండగే.. సౌత్ ఇండియాలో రజినీకాంత్ సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

One Rupee Dosa: రూపాయికే దోసె.. కడుపు నిండా పెట్టేందుకే.. అభిమానంతోనే!

Dosa

One Rupee Dosa: రజినీకాంత్ సినిమా విడుదల అంటే అభిమానులకు పండగే.. సౌత్ ఇండియాలో రజినీకాంత్ సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజినీపై అభిమానంతో రక్తదానాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ‘అన్నాత్తె’ విడుదలైన సంధర్భంగా దోసెను ఓ అభిమాని రూపాయికే అమ్ముతున్నాడు. తిరుచ్చిలోని కర్ణన్​ హోటల్‌ యజమాని రజినీకాంత్‌పై అభిమానంతో రూపాయికే దోసె ఇచ్చాడు.

ఈ హోటల్‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నాత్తె సినిమా విడుదల సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ తన హోటల్‌కు వచ్చే కస్టమర్లకు కర్ణన్ రూపాయికే దోసెను అందిస్తున్నారు. కరోనా తర్వాత థియేటర్లలో ప్రేక్షకులు ఎక్కువగా రావడానికి రజినీకాంత్ సినిమా ప్రభావం చూపిస్తుందని, రజినీకాంత్ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు కర్ణన్ చెప్పుకొచ్చారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తె సినిమా తెలుగులో పెద్దన్నగా రిలీజ్ అయ్యింది. చెన్నైలో అన్నాత్తే సినిమా థియేటర్లకు అభిమానులు పోటెత్తుతున్నారు. రజినీ సినిమాను తొలిరోజు మొదటి ఆట చూడాలనే ఉత్సాహంతో థియేటర్ల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు అభిమానులు.