Drugs Case: 2015 నుండి లావాదేవీలపై ఆరా.. నేడు ఈడీ ముందుకు ముమైత్!

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వయా శాండల్‌వుడ్ ఇండస్ట్రీల్లో డ్రగ్స్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా సినీ నటి ముమైత్ ఖాన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌...

10TV Telugu News

Drugs Case: టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వయా శాండల్‌వుడ్ ఇండస్ట్రీల్లో డ్రగ్స్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా సినీ నటి ముమైత్ ఖాన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఈరోజు (బుధవారం) ప్రశ్నించనున్నారు. ఇదే రోజు విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ అధికారులు ఇప్పటికే సమన్లు జారీ చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ముంబైలో నేడు హైదరాబాద్ రానుంది.

Akkineni Heroes: బ్యాక్ టూ బ్యాక్ అక్కినేని సినిమాలు.. హ్యాపీ మూడ్‌లో ఫ్యాన్స్!

ముంబై నుండి శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న ముమైత్ ఖాన్ అక్కడి నుండి ఈడీ ఆఫీస్ కి చేరుకోనుంది. ముమైత్ ఖాన్, కెల్విన్ కి ఉన్న సంబంధాలపై ఆరా తీయనున్న ఈడీ ఇప్పటికే ముమైత్ నుండి పెద్ద మొత్తంలో డబ్బులు కెల్విన్ కి బదిలీ అయినట్లు గుర్తించినట్లు తెలుస్తుంది. 2015 నుండి లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్స్ పత్రాలతో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తుండగా కెల్విన్ నుండి విపరీతంగా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు.

PV Sindhu Biopic: దీపికా మరో క్రేజీ ఫిల్మ్.. సిల్వర్ స్క్రీన్ మీద సింధు సక్సెస్ స్టోరీ!

కాగా, గతంలో 2017లో 6 గంటల పాటు ఎక్సైజ్ అధికారులు ముమైత్ ను విచారించగా.. అప్పట్లో బిగ్ బాస్ షో లో ఉన్న ముమైత్ పర్మిషన్ తో ఎక్సైజ్ విచారణకు హాజరైంది. ఇప్పుడు ముమైత్ ఖాన్ కెల్విన్ ని నేడు కలిపి విచారించే అవకాశం ఉండగా ఈడీ ముమైత్ ఖాన్ బ్యాంక్ లావాదేవీలు, విదేశీ డ్రగ్స్ పెడలర్ తో జరిపిన ట్రాన్సక్షన్ పై ఆరా తీయనున్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ నుండి రవితేజ, ఛార్మి, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నందు, నవదీప్ ఇలా వరసగా విచారణ సాగిస్తున్న సంగతి తెలిసిందే.

Big Boss 5: ఏడుగురిని గొర్రెలుగా చేసిన హౌస్‌లోకి వచ్చిన ఓ గుంట నక్క!

కాగా, అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈ విచారణ సాగుతున్నట్లు తెలుస్తుంది. తొలుత కేసు అంతా డ్రగ్‌ సరఫరాదారుడు కెల్విన్‌ చుట్టూ తిరిగినా.. విచారణ క్రమంలో ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు. అప్రూవల్ గా మారిన కెల్విన్‌, అతడి స్నేహితుడు.. ఈవెంట్‌ మేనేజర్‌ జీషాన్‌అలీల బ్యాంక్‌ఖాతాల్లోకి ఎవరెవరి నుంచి డబ్బుల మళ్లింపులు జరిగాయన్న అంశాలపై ఆరా తీసి విచారణ చేపట్టారు.

10TV Telugu News