SC sharp reaction on XXX: యువత మనసు చెడగొడుతున్నావంటూ ఏక్తా కపూర్‭పై సుప్రీం కోర్టు ఆగ్రహం

ఫిల్మ్ మేకర్ ఏక్తా కపూర్ నేతృత్వంలోని ఓటీటీ ప్లాట్‌ఫాం ఆల్ట్‌బాలాజీలో XXX వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది. ఈ సిరీస్‭లో భాగంగా ట్రిపుల్ ఎక్స్ సీజన్-2లో ఓ సైనికుని భార్యకు సంబంధించిన సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని శంభు కుమార్ అనే మాజీ సైనికుడు 2020లో ఫిర్యాదు చేశారు. సైనికులు, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు

SC sharp reaction on XXX: యువత మనసు చెడగొడుతున్నావంటూ ఏక్తా కపూర్‭పై సుప్రీం కోర్టు ఆగ్రహం

Ekta Kapoor's web series XXX draws SC's sharp reaction: 'You're polluting young minds'

SC sharp reaction on XXX: తనపై జారీ అయిన అరెస్ట్ వారంట్లను సవాల్ చేస్తూ సుప్రీం తలుపు తట్టిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌కు చుక్కెదురైంది. అంతే కాకుండా.. ఆమెపై వేసిన కేసును సమర్ధిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఆమె ప్రసారం చేస్తున్న వెబ్ సిరీస్ XXX (ట్రిపుల్ ఎక్స్)లో అభ్యంతరకరమైన కంటెంట్ ఉందని, అది ఈ దేశ యువతరం మనసులను కలుషితం చేస్తోందని సుప్రీం ధర్మాసనం మండిపడడం గమనార్హం.

ఫిల్మ్ మేకర్ ఏక్తా కపూర్ నేతృత్వంలోని ఓటీటీ ప్లాట్‌ఫాం ఆల్ట్‌బాలాజీలో XXX వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది. ఈ సిరీస్‭లో భాగంగా ట్రిపుల్ ఎక్స్ సీజన్-2లో ఓ సైనికుని భార్యకు సంబంధించిన సన్నివేశాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని శంభు కుమార్ అనే మాజీ సైనికుడు 2020లో ఫిర్యాదు చేశారు. సైనికులు, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై బిహార్‌లోని బేగుసరాయ్ ట్రయల్ కోర్టు ఏక్తా కపూర్‌ను అరెస్టు చేసేందుకు వారంట్లు జారీ చేసింది. ఈ అరెస్ట్ వారంట్లను సవాల్ చేస్తూ ఏక్తా కపూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Gurmeet Ram Rahim Singh: డేరా బాబాకు బెయిల్.. 40 రోజుల పెరోల్‌పై విడుదల కానున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్

ఆమె తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. తాము పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, అది త్వరగా విచారణకు వస్తుందనే ఆశ లేదని చెప్పారు. ఇటువంటి కేసులో గతంలో అత్యున్నత న్యాయస్థానం ఏక్తా కపూర్‌నకు ఉపశమనం కల్పించిందని గుర్తు చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫాంపై ప్రసారమవుతున్న కంటెంట్ సబ్‌స్క్రిప్షన్ ఆధారితమైనదని తెలిపారు. ఈ దేశంలో తమకు నచ్చిన కంటెంట్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. దీనిపై కోర్టు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ దేశ యువతరం మనసులను మీరు కలుషితం చేస్తున్నారని సుప్రీం ధర్మాసనం మండిపడింది. ఓటీటీ ద్వారా వెబ్ సిరీస్ అందరికీ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ సీటీ రవి కుమార్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వాదనపై స్పందిస్తూ ‘‘మీరు ప్రతిసారీ ఈ కోర్టుకు వచ్చేస్తున్నారు. దీనిని సమర్థించలేం. ఇలాంటి పిటిషన్లను దాఖలు చేస్తున్నందుకు జరిమానా విధిస్తాం. రోహత్గీ గారూ, మీ క్లయింటుకు ఈ విషయాన్ని చెప్పండి. మంచి న్యాయవాదుల సేవలను పొందగలుగుతున్నారనే కారణంతో, నోరున్నవారి కోసం ఈ కోర్టు లేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘నోరు లేనివారి కోసం ఈ కోర్టు పని చేస్తోంది. అన్ని రకాల సదుపాయాలు ఉన్నవారే న్యాయం పొందలేకపోతే, ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటో ఆలోచించండి. ఆర్డర్‌ను పరిశీలించాం, మా అభ్యంతరాలు మాకు ఉన్నాయి’’ అని ధర్మాసనం తెలిపింది.

Chinese Criticising Jinping: జిన్‭పింగ్‭కు నిరసన సెగ.. దేశద్రోహి, నియంతను ఓడించాలంటూ బ్యానర్లు.. చైనాలో కొత్త ఒరవడి