పోసానికి ఈసీ నోటీసులు.. ఆసుపత్రిలో చేరానంటూ లేఖ

ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది.

  • Published By: vamsi ,Published On : March 21, 2019 / 01:47 AM IST
పోసానికి ఈసీ నోటీసులు.. ఆసుపత్రిలో చేరానంటూ లేఖ

ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది.

ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయింది. ఇటీవల ఒక ప్రెస్‌మీట్ పెట్టి ఎన్నికల సంఘంపైన విమర్శలు చేయడంతోపాటు.. చంద్రబాబుకి కులాన్ని ఆపాదించి.. కమ్మ రాజ్యం వస్తుంది ఓట్లేయొద్దు అంటూ చెప్పడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పోసాని మాటలను తప్పుబడుతూ.. తెలుగుదేశం నేతలు ఎలక్షన్ కమీషన్‌కు ఫిర్యాదు చేయగా ఎలక్షన్ కమీషన్ స్పందించింది. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు వెంటనే ఈసీ ముందు ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ పోసానిని ఆదేశించింది.  
Read Also : టీడీపీ మేనిఫెస్టో విడుదల రేపటికి వాయిదా

అయితే నోటీసులు అందుకున్న పోసాని కృష్ణ మురళి వెంటనే స్పందిస్తూ.. ఎన్నికల సంఘంకు లేఖ రాశారు. చంద్రబాబుపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, విచారణకు హాజరు కాలేనంటూ అందులో వెల్లడించారు. నడవలేని స్థితిలో ఆపరేషన్ కోసం యశోద ఆసుపత్రిలో చేరానని, అందువల్ల హాజరు కాలేనంటూ తెలిపారు. 
Read Also : ఎన్నికల్లో గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం