Emaipothane : జులై 1న రాబోతున్న ప్రేమకథ.. ఏమైపోతానే.. | Emaipothane movie releasing on July 1st

Emaipothane : జులై 1న రాబోతున్న ప్రేమకథ.. ఏమైపోతానే..

దర్శకుడు, నిర్మాత సురేష్ కుమార్ కుసిరెడ్డి మాట్లాడుతూ.. ''ప్రేమకథా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని భావిస్తున్నాను. పాటలకు ఎంతో అద్భుతమైన.........

Emaipothane : జులై 1న రాబోతున్న ప్రేమకథ.. ఏమైపోతానే..

Emaipothane :  సినిమా పరిశ్రమలో ఎన్నో రకాల జోనర్ లలో సినిమాలు వచ్చినా ప్రేమకథా జోనర్ సినిమాలకు ఎక్కువ ఆదరణ దక్కుతుంటుంది. ప్రేక్షకులలో మంచి ఫీలింగ్ ని కలిగించే ఈ సినిమాలు మంచి హిట్స్ అవుతూ ఉంటాయి కూడా. అలా ఫీల్ గుడ్ ప్రేమకథగా తెరకెక్కిన చిన్న సినిమా ఏమైపోతానే.

అమర్ లతు, చాందిని పౌర్ణమి హీరో హీరోయిన్ లుగా  నటిస్తున్న ఈ సినిమా లో విజయ్ రామ్, జె. నరేష్ రెడ్డి , శివ నరిశెట్టి, సరిపల్లి సతీష్, సుజాత, మహేంద్ర నాథ్, భలే రావు, రవళి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా యూ/ఏ సర్టిఫికెట్ అందుకుంది. సురేష్ కుమార్ కుసిరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాకి వసంత్.జి సంగీతం సమకూర్చారు. కె. వెంకటేష్ సినిమాటోగ్రాఫర్ గా చేయగా శివ శార్వాణి ఎడిటింగ్ అందించారు. ఈ సినిమా జులై 1వ తేదీన విడుదల అవుతుంది.

Ranbir Kapoor : మేం మండపంలోకి చెప్పులు వేసుకొనే వెళతాం.. బ్రహ్మాస్త్ర వివాదంపై స్పందించిన డైరెక్టర్..

ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత సురేష్ కుమార్ కుసిరెడ్డి మాట్లాడుతూ.. ”ప్రేమకథా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని భావిస్తున్నాను. పాటలకు ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల ప్రీమియర్ షోకి వచ్చిన రెస్పాన్స్ కూడా మర్చిపోలేనిది. ఆరోజు అందరి స్పందన నాకు ఈ సినిమాపై మంచి కాన్ఫిడెన్స్ ను పెంచింది. ఈ సినిమాలో మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాలో నటించిన, పనిచేసిన అందరు కూడా ఎంతో బాగా సపోర్ట్ చేశారు. జులై 1న ఈ చిత్రం అందరి ముందుకు రాబోతుంది” అని తెలిపారు.

×