Manchu Manoj: జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్నా.. మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

మంచు మనోజ్ వెల్లడించబోయే ఆసక్తికర విషయం ఏంటా అని అందరూ ఆరా తీస్తున్నారు. కొందరు మనోజ్ కొత్త చిత్రం గురించి అయ్యుంటుందని భావిస్తుంటే.. ఇంకొందరు మనోజ్ రెండో పెళ్లి గురించి కావొచ్చని అనుకుంటున్నారు. శుక్రవారం రోజు ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుంది.

Manchu Manoj: జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్నా.. మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Manchu Manoj: మంచు మోహన్ బాబు తనయుడు, యువ కథానాయకుడు మంచు మనోజ్ బుధవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘నా హృదయానికి దగ్గరైన ప్రత్యేక విషయాన్ని కొంతకాలంగా నాలోనే దాచుకున్నా. జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.

Bengaluru: గొంతు కోసి డిగ్రీ విద్యార్థిని హత్య.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన యువకులు

దీనికి సంబంధించిన వివరాల్ని జనవరి 20న ప్రకటిస్తా. ఎప్పట్లాగే మీ అందరి ఆశీస్సులూ కావాలి’’ అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. దీనికి తన తొలి చిత్రం ‘దొంగదొంగది’లోని ఒక జిఫ్ ఫైల్ కూడా యాడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెటిజన్లు, మనోజ్ ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది. మంచు మనోజ్ వెల్లడించబోయే ఆసక్తికర విషయం ఏంటా అని అందరూ ఆరా తీస్తున్నారు. కొందరు మనోజ్ కొత్త చిత్రం గురించి అయ్యుంటుందని భావిస్తుంటే.. ఇంకొందరు మనోజ్ రెండో పెళ్లి గురించి కావొచ్చని అనుకుంటున్నారు. శుక్రవారం రోజు ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుంది. అనేక చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన మనోజ్ కొంతకాలంగా సినిమాల్ని విడుదల చేయలేదు.

Shubman Gill: సెంచరీ పూర్తి చేసుకున్న శుభ్‌మన్ గిల్.. నిలకడగా ఆడుతున్న భారత్

గతంలో ‘అహం బ్రహ్మస్మి’ అనే చిత్రం చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, దీనిపై తర్వాత ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇంతకీ ఈ చిత్రం వస్తుందో, లేదో కూడా సమాచారం లేదు. మనోజ్ చివరిసారిగా 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత ఒకట్రెండు చిత్రాల్లో క్యామియోస్ చేశాడు. దాదాపు ఐదేళ్ల నుంచి మనోజ్ వెండితెరపై కనిపించలేదు. వ్యక్తిగత జీవితానికొస్తే గతంలో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్న మనోజ్ తర్వాత ఆమెకు విడాకులిచ్చాడు. త్వరలోనే రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.