Movie Release: ఎంటర్‌టైన్మెంట్ సీజన్.. మోతమోగిపోనున్న మార్చి!

స్టార్ హీరోల సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మార్చి ఫాన్స్ కు సినిమా సీజన్ అయిపోయింది. వరసపెట్టి సినిమాలు, వాటితో పోటీపడుతూ ఓటీటీసిరీస్ లు.. అబ్బో.. ఎంటర్ టైన్ మెంట్..

Movie Release: ఎంటర్‌టైన్మెంట్ సీజన్.. మోతమోగిపోనున్న మార్చి!

Movie Release

Movie Release: స్టార్ హీరోల సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మార్చి ఫాన్స్ కు సినిమా సీజన్ అయిపోయింది. వరసపెట్టి సినిమాలు, వాటితో పోటీపడుతూ ఓటీటీసిరీస్ లు.. అబ్బో.. ఎంటర్ టైన్ మెంట్ అదిరిపోతోంది ఈనెలలో. మరి ఎంటర్ టైన్ మెంట్ సీజన్ ని స్టార్ట్ చేస్తున్న ఈ మార్చి నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలేంటో, ఎగ్జైటింగ్ సిరీస్ లేంటో డీటెయిల్డ్ గా చూద్దాం.

Aadavallu Meeku Johaarlu: కలిసొచ్చిన కామెడీనే నమ్ముకున్న శర్వా.. హిట్ కొట్టేనా?

ఎంటర్ టైన్ మెంట్ కి సీజన్ స్టార్ట్ అయ్యింది. ఒక వైపుసినిమాలు.. మరోవైపు సిరీస్ లు.. వరసపెట్టి రిలీజ్ అవుతున్నాయి మార్చిలో. మాంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు మార్చి 4న శుక్రవారం నుంచి థియేటర్లో సందడి మొదలు పెట్టాడు. ఇదే రోజు కిరణ్ అబ్బవరం, సెబాస్టియన్ పిసి 524 సినిమా కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ కి సంబంధించి అమితాబ్ బచ్చన్ జండ్ మూవీ కూడా మార్చి 4నే రిలీజ్ అవుతోంది. హాలీవుడ్ మూవీ బ్యాట్ మ్యాన్ మార్చి 4నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Sebastian P.C. 524 Trailer: ఓడెమ్మ.. అండర్ ది కంట్రోల్ అఫ్ సెబాస్టియన్ ఇక్కడ!

బాలీవుడ్ లో భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన అజయ్ దేవ్ గన్, రాశిఖన్నా స్టారర్ రుద్ర సిరీస్ మార్చి 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రుద్ర సిరీస్ తో అజయ్ దేవ్ గన్ ఫస్ట్ టైమ్ ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. ధ్రిల్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ క్రైమ్ డ్రామా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన అన్ దేఖీ సీజన్ 2 సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతోంది. జేమ్స్ బాండ్ గా డ్యానియల్ క్రెయిగ్ చేసిన లాస్ట్ మూవీ నో టైమ్ టు డై మూవీ అమెజాన్ ప్రైమ్ లో మార్చి 4 నుంచి స్ట్రీమ్ అవుతోంది.

RRR: కొమురం భీముడో.. ఆర్ఆర్ఆర్ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే పాట!

వరల్డ్ వైడ్ గా ఫాన్స్ వెయిట్ చేస్తున్న మూవీ రాధేశ్యామ్. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ మార్చి 11న వరల్డ్ వైడ్ గా రికార్డ్ ధియేటర్లలో రిలీజ్ కాబోతోంది. మార్చి 11న బాలీవుడ్ కాంట్రవర్షియల్ మూవీ కాశ్మీర్ ఫైల్స్ ధియేటర్ రిలీజ్ కి రెడీఅవుతోంది. ర్యాన్ రేనాల్డ్స్ సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ద ఆడమ్ ప్రాజెక్ట్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో మార్చి 11న స్ట్రీమ్ అవుతోంది.

Radhe Shyam: టైటానిక్‌ను మించి.. విజువల్ వండర్‌గా రాధేశ్యామ్?

మార్చి 18న బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మూవీ బచ్చన్ పాండే రిలీజ్ అవుతోంది. నెగెటివ్ షేడ్స్ తో లుక్ వైజ్ డిఫరెంట్ గా ఉన్న అక్షయ్ కుమార్ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న మూవీ బచ్చన్ పాండే.

Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ దూకుడు.. వచ్చే ఏడాది కూడా నాదే!

వరల్డ్ వైడ్ ఫాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని 4 ఏళ్ల నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ట్రిపుల్ఆర్. ఎన్టీఆర్, చరణ్ లీడ్ రోల్స్ లో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్ తో గ్రాండ్ గా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ మూవీ 4రిలీజ్ డేట్స్ మార్చుకుని మార్చి 25న ఫైనల్లీ వరల్డ్ వైడ్ గా ధియేటర్లో రిలీజ్ అవుతోంది.

Movie Releases: ఛాయిస్ మీదే.. ఈ వారం థియేటర్లలోకొచ్చిన సినిమాలివే!

ఈ మన్త్ ఎండ్ లాస్ట్ వీక్ మార్చి 25న ఓటీటీ లో ఇంట్రస్టింగ్ సిరీస్, సినిమాలు రాబోతున్నాయి. ఫస్ట్ సీజన్ లో సూపర్ హిట్ అయిన బ్రిడ్జర్ టన్ షో.. సెకండ్ సీజన్ ని అంతకుమించి ఎంటర్టైనింగ్ గా తీసుకొస్తోంది. ఇక మూన్ నైట్ సిరీస్ మార్చి 30న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవ్వబోతోంది. మార్చి 30న జై దీప్, జీ షాన్ లాంటి క్రేజీ ఆర్టిస్ట్ లతో బ్రిటిష్ త్రిల్లర్ మిస్టరీ షో ఆధారంగా తెరకెక్కించిన బ్లడీ బ్రదర్.. జీ 5లో రిలీజ్ కాబోతోంది.