జనవరి 15న ‘ఎంత మంచివాడవురా’

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా.. నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఎంత మంచివాడవురా’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది..

  • Published By: sekhar ,Published On : October 26, 2019 / 12:05 PM IST
జనవరి 15న ‘ఎంత మంచివాడవురా’

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా.. నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఎంత మంచివాడవురా’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది..

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఎంత మంచివాడవురా’.. ఈ సినిమాతో ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ సంస్థ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టింది..

శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో, ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్న ‘ఎంత మంచివాడవురా’ టీజర్ దసరా స్పెషల్‌గా రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. ప్రేక్షకులకు దీపావళి విషెస్ చెబుతూ న్యూ పోస్టర్ విడుదల చేశారు.

Read Also : ‘రాములో రాములా’ ఫుల్ సాంగ్ : ధూమ్ ధామ్

ఈ సినిమా చివరి షెడ్యూల్ కేరళలో ప్లాన్ చేశారు. లవ్, యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఎంత మంచివాడవురా’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం : గోపి సుందర్, కెమెరా : రాజ్ తోట, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : రామాంజనేయులు, ఫైట్స్ : వెంకట్.