Errabelli Dayakar Rao : మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా.. వరంగల్ లో ఫిలిం స్టూడియో పెట్టండి.. KCRతో నేను మాట్లాడతాను..
తాజాగా ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం వరంగల్ లో భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేశారు. అలాగే తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా హాజరయ్యారు.

Errabelli Dayakar Rao speech in Agent Movie Pre Release Event
Errabelli Dayakar Rao : అక్కినేని అఖిల్(Akkineni Akhil), సాక్షి వైద్య(Sakshi Vaidya) జంటగా సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏజెంట్(Agent). మొదటి సారి అఖిల్ పూర్తిగా మాస్, యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. ఏజెంట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ఏజెంట్ సినిమాను ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ తో ఫుల్ జోష్ లో ఉంది చిత్రయూనిట్.
తాజాగా ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం వరంగల్ లో భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేశారు. అలాగే తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూడా హాజరయ్యారు. గతంలో చిరంజీవి సినిమా ఫంక్షన్ కూడా వరంగల్ లో జరిగితే అప్పుడు కూడా దయాకర రావు హాజరయి వరంగల్ లో స్టూడియో పెట్టాలని కోరారు. ఇప్పుడు మరోసారి ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇదే విషయాన్నీ ప్రస్తావించారు.
Urvashi Rautela : అఖిల్ గురించి అలా అన్నందుకు లీగల్ నోటీసులు పంపిన ఊర్వశి రౌతేలా..
ఏజెంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ.. నేనొక్కటే చెప్తున్నా వరంగల్ లో ఏ సినిమా చేసినా హిట్ అవుతుంది. స్టార్ హీరోలు అంతా సినిమాలు చేశారు ఇక్కడ. వరంగల్ లో సినిమా ప్రమోషన్స్ చేసిన అన్ని సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఏ సినిమా చేసినా వరంగల్ లో ప్రమోషన్స్ చేయండి. నేను చూసుకుంటా. నేను అందరికి చెప్తున్నా, ఇక్కడ ఫిలిం స్టూడియో పెట్టండి. KCR తో మాట్లాడి నేను స్థలం ఇప్పిస్తాను. మీకు ఎంత జాగా కావాలన్నా అంత ఇప్పిస్తాను. స్టూడియో పెట్టె బాధ్యత మీదే. తెలంగాణ వచ్చాక హైదరాబాద్ తర్వాత అంత గుర్తింపు ఒక్క వరంగల్ కే వచ్చింది. ప్లీజ్ ఇక్కడ ఒక్క స్టూడియో పెట్టండి. మీకు ఏ విషయంలో సపోర్ట్ కావాలన్నా ఉంటాను అని అన్నారు.