Evaru Meelo Koteeswarulu : డబ్బులు కావాలంటున్న సమంత..

ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో లో సమంత గెస్ట్‌గా నవరాత్రి స్సెషల్ ఎపిసోడ్..

Evaru Meelo Koteeswarulu : డబ్బులు కావాలంటున్న సమంత..

Samantha

Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో తో మరోసారి తెలుగు ప్రేక్షకులను, బుల్లితెర అభిమానులను తన స్టైల్లో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చారు.

Unstoppable With NBK : ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’

ఇప్పుడు సౌత్ క్వీన్ సమంత ఈ షో కి రానుంది. సామ్ గెస్ట్‌గా రాబోతోంది. నవరాత్రి స్పెషల్‌గా సమంత ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఆదివారం ప్రోమో రిలీజ్ చేశారు. తారక్‌తో కలిసి సామ్ సరదాగా సందడి చేయనుందని అర్థమవుతోంది.

Unstoppable With NBK : ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’

నాగ చైతన్యతో విడాకుల కారణంగా వార్తల్లో వినిపిస్తున్న సమంత.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో లో కనిపించనుండడంతో నవరాత్రి ఎపిసోడ్ మీద భారీ హైప్ ఉంది. సామ్ – ఎన్టీఆర్ ‘బృందావనం’, ‘రభస’, ‘రామయ్య.. వస్తావయ్యా’, ‘జనతా గ్యారేజ్’ సినిమాల్లో కలిసి నటించారు.

Bigg Boss 5 Telugu : అఖిల్, పూజా హెగ్డే హైలైట్‌గా నవరాత్రి ఎపిసోడ్