Movie Releases: షూటింగ్ ఎప్పుడో మొదలైనా.. రిలీజ్ ఎప్పుడో క్లారిటీ లేదే!
ఎప్పుడో పట్టాలెక్కి ఇంకా షూటింగ్ కంటిన్యూ చేస్తోన్న సినిమాలు... రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీకి రాని స్టార్స్ ఉన్నారు. ఏదేమైనా మహేశ్ సర్కారు ఆట ముగిసిందంటే.. చిన్న సినిమాలు, యంగ్ హీరోలు జాతర చూపిస్తారు.

Movie Releases: ఎప్పుడో పట్టాలెక్కి ఇంకా షూటింగ్ కంటిన్యూ చేస్తోన్న సినిమాలు… రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీకి రాని స్టార్స్ ఉన్నారు. ఏదేమైనా మహేశ్ సర్కారు ఆట ముగిసిందంటే.. చిన్న సినిమాలు, యంగ్ హీరోలు జాతర చూపిస్తారు. అయితే అదీ ఆగస్ట్ వరకే. ఆ తర్వాత డిసెంబర్ వరకు ఇప్పటికైతే ఎవరూ పెద్దగా డేట్ రిజర్వ్ చేసుకోలేదు. కానీ.. ఫోకస్ నెక్ట్స్ ఇయర్ కి షిఫ్ట్ చేస్తారా.. లేక సెకండ్ హాఫ్ లో వరుసగా కొత్త డేట్స్ చెప్పేస్తారా అన్నది చూడాల్సి ఉంది.
Movie Releases: సినిమా పండగ.. ఈ వారం మొత్తం డజను సినిమాలు వచ్చేశాయ్!
మే 20 నుంచి ఆగస్ట్ 12 వరకు నాని, నితిన్, నిఖిల్, నాగచైతన్య, నాగశౌర్య, అఖిల్, గోపీచంద్.. ఇలా యంగ్ హీరోలందరూ వరుసగా థియేటర్స్ లో షో వేయబోతున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆగస్ట్ 25న బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ రిలీజ్ కానుంది. రిలీజ్ కి ముందే నార్త్ లో క్రేజ్ చూపిస్తున్న రౌడీబాయ్.. లైగర్ తో పాన్ ఇండియా స్టార్ గా మెరవాలని కలలు కంటున్నాడు. కరణ్ జోహార్ లాంటి మేకర్స్ సపోర్ట్ కూడా విజయ్ కుంది.
Telugu Movie Releases: బాక్సాపీస్ వద్ద కొత్త సినిమాల వాషౌట్.. ఆర్ఆర్ఆర్ ఎఫెక్టేనా?
లైగర్ తర్వాత సెప్టెంబర్ 30న రవితేజ రావణాసురగా రాబోతున్నాడు. అంతే ఆ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను 2023 సంక్రాంతికి, సలార్ సినిమాను నెక్ట్స్ సమ్మర్ కి పోస్ట్ పన్ చేశారు. రామ్ చరణ్ – శంకర్ సినిమా కూడా వచ్చే సంక్రాంతికి వచ్చేలానే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా షూటింగ్ షురూ కాని పుష్ప2 కూడా 2023కు షిఫ్ట్ అయినట్టే. సో ఈ ఏడాది ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించకపోవచ్చు.
Movie Releases: స్టార్ హీరోల హవా.. చిన్న హీరోల టార్గెట్ ఈ రెండు నెలలే!
ఈ ఏడాది ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఇప్పటికైతే ఏ స్టార్ హీరో సినిమా కూడా డేట్ ఫిక్స్ చేసుకోలేదు. చిరంజీవి చేతిలో లూసిఫర్, భోళాశంకర్ లాంటి సినిమాలున్నా వాటి రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక కోవిడ్ తో బాగా లేట్ అయిన హరిహర వీరమల్లు దసరా బరిలో నిలిచే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మిగిలిన పార్ట్ షూటింగ్ ను పవన్ కల్యాణ్, క్రిష్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
Movie Releases: సినిమా చూపిస్తా మావా.. టాలీవుడ్ సినిమా సందడి షురూ!
గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ నటిస్తున్న సినిమా కూడా ఈ ఏడాది చివరి వరకు వచ్చే అవకాశముంది. మహేశ్ – త్రివిక్రమ్, తారక్ – కొరటాల సినిమాలు ఇంకా మొదలుపెట్టలేదు. ఒకవేళ స్టార్ట్ చేసినా ఈ ఏడాది రిలీజ్ అవుతాయా అన్నది అనుమానమే. సో 2022 చివరి నాలుగు నెలల్లో ఎవరెవరు ప్రేక్షకుల ముందుకు వస్తారనేగది పెద్ద పజిల్ గా మారింది. ఒకవేళ స్టార్స్ క్రేజీమూవీస్ అప్పుడు కూడా దాటేస్తే.. మళ్లీ చిన్న సినిమాలు, యంగ్ హీరోలు పండుగ చేసుకోవచ్చు. ఎలాగూ నిఖల్ 18 పేజీస్, నాని దసరా వంటి సినిమాలతో పాటూ విశ్వక్ సేన్ లాంటి హీరోలు లాస్ట్ క్వార్టర్ లో మంచి డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.
- OTT Release: గెట్ రెడీ.. ఈ వారం ఓటీటీలో రాబోయే సినిమాలివే!
- Movie Collections: ఫస్ట్ డే ఎలా దండుకోవాలి.. ఇదే ఇప్పుడు సక్సెస్ ఫార్ములా!
- Sonal Chauhan : అందుకే తెలుగులో గొప్ప సినిమాలు వస్తున్నాయి..
- Bollywood: ఒకవైపు సౌత్.. మరోవైపు హాలీవుడ్.. బాలీవుడ్‌కు దెబ్బ మీద దెబ్బ!
- Telugu Movies: మాస్ మంత్రాన్ని పలికేస్తున్న స్టార్ హీరోలు!
1IPL2022 Gujarat Vs RR : గుజరాత్ గర్జన.. నేరుగా ఫైనల్‌కు.. ఓడినా రాజస్తాన్‌కు మరో ఛాన్స్
2Kottu Satyanarayana Allegations : కోనసీమ అల్లర్లు.. జనసేన, టీడీపీ కుట్రలో భాగమే -మంత్రి సంచలన ఆరోపణలు
3Telangana Covid Bulletin : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే
4Konaseema : సాంప్రదాయాలకు, మర్యాదలకు పుట్టినిల్లు కోనసీమ
5IPL2022 Rajasthan Vs GT : బట్లర్ బాదుడు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్
6Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
7Konaseema Tension : హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు : ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు
8F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
9Vegan Dinosaur: డైనోసార్లు వెజిటేరియన్లా.. జపాన్ లో కనిపించిన శిలాజాలు చెప్తున్నాయేంటంటే..
10Konaseema Tension : కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి-చంద్రబాబు నాయుడు
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
-
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్
-
Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!
-
Venkatesh: మరో రెండు ప్రాజెక్టులకు వెంకీ సై!
-
Nikhil: ఫస్ట్‌టైమ్ అలా చేస్తున్న నిఖిల్..?