మహర్షి : ఎవరెస్ట్ అంచున సాంగ్ ప్రివ్యూ

మహర్షి నుండి ఎవరెస్ట్ అంచున సాంగ్ ప్రివ్యూ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : April 19, 2019 / 11:01 AM IST
మహర్షి : ఎవరెస్ట్ అంచున సాంగ్ ప్రివ్యూ

మహర్షి నుండి ఎవరెస్ట్ అంచున సాంగ్ ప్రివ్యూ రిలీజ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, హాట్ బ్యూటీ పూజాహెగ్డే హీరో, హీరోయిన్స్‌గా, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీ దత్, పీవీపీ, దిల్ రాజు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ మహర్షి.. హీరోగా మహేష్‌కిది 25 వ సినిమా.. ఈ సినిమాలో అల్లరి నరేష్ మహేష్ ఫ్రెండ్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్‌కి, రెండు సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మహర్షి నుండి డీఎస్పీ కంపోజ్ చేసిన ఎవరెస్ట్ అంచున అనే సాంగ్ ప్రివ్యూ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఎవరెస్ట్ అంచున పూసిన రోజాపువ్వే ఓ చిరునవ్వే విసిరిందే.. టెలిస్కోప్ అంచుకి చిక్కని దారై నాతో ప్రేమలో చిక్కానంటుందే.. అంటూ సాగే సాంగ్ ప్రివ్యూ విజువల్‌గా బాగుంది. శ్రీమణి రాసిన లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి.

మహర్షిలో మహేష్ మూడు ఢిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడని తెలుస్తుంది. కార్పొరేట్ కంపెనీ సీఈఓగా, ప్రపంచలోనే అత్యంత ధనవంతులైన అయిదు మందిలో ఒకడిగా, యూఎస్ నుండి తిరిగొచ్చి వ్యవసాయంలో రైతులకు సరికొత్త విధానాన్ని తెలియచెప్పేలా పలు షేడ్స్ ఉంటాయట మహేష్ క్యారెక్టర్‌లో.. రీసెంట్‌గా మహర్షి షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మే 9 న సినిమా రిలీజ్ కానుంది.

వాచ్ ఎవరెస్ట్ అంచున సాంగ్ ప్రివ్యూ..