Small Heroes: బడా సినిమాల మధ్యలో చిన్న హీరోలకు పరీక్షా కాలం!

బిగ్ స్టార్స్ తో పాటే మేమున్నామంటున్నారు యంగ్ హీరోలు.. హై బడ్జెట్ సినిమాలతో పాటే మినిమం, లో బడ్జెట్ సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. అయితే స్టార్స్ క్రియేట్ చేస్తోన్న హైప్ ముందు..

Small Heroes: బడా సినిమాల మధ్యలో చిన్న హీరోలకు పరీక్షా కాలం!

Small Heroes

Small Heroes: బిగ్ స్టార్స్ తో పాటే మేమున్నామంటున్నారు యంగ్ హీరోలు.. హై బడ్జెట్ సినిమాలతో పాటే మినిమం, లో బడ్జెట్ సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి. అయితే స్టార్స్ క్రియేట్ చేస్తోన్న హైప్ ముందు.. చిన్న సినిమాల సందడి కాస్త తక్కువగానే ఉంది. వాళ్ల రేంజ్ లో ఎంత కష్టపడ్డా.. కంటెంట్ బాగుంటేనే ఆడియెన్స్ థియేటర్ లో అడుగుపెడుతున్నారు.

South Stars: బాలీవుడ్‌లో జెండా పాతేస్తున్న లోకల్ స్టార్స్!

బిగ్ బడ్జెట్, స్టార్ కాస్ట్, భారీ హైప్.. ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఆడియెన్స్ ను థియేటర్స్ కి తీసుకొచ్చే ఎలిమెంట్స్. ఎలాగూ ఫ్యాన్స్ హడావిడీ ఉండనే ఉంటుంది. వీటితో మహా అయితే ఓ మూడు, నాలుగు రోజులు సినిమాను ఆడించొచ్చు. కానీ ఆల్టిమేట్ గా సినిమా బాగుంటేనే లాంగ్ రన్ ప్లస్ హై రేంజ్ కలెక్షన్స్ దక్కుతాయి. ఇప్పుడు రాధేశ్యామ్ విషయంలో జరుగుతున్నది ఇదే. కానీ యంగ్ హీరోలు, మినిమం బడ్జెట్ సినిమాల పరిస్థితి వేరు. మొదటి రోజే సినిమాకు రావడం సంగతి అటుంచితే.. పాజిటివ్ టాక్ వస్తేనే జనం థియేటర్స్ కి వచ్చేలా ఆలోచిస్తున్నారు.

Film Controversies: మనోభావాలు దెబ్బతింటున్నాయ్.. కాంట్రవర్సీలు పుట్టుకొస్తున్నాయ్!

రాధేశ్యామ్, ట్రిపుల్ ఆర్ మధ్యలో వచ్చిన స్టాండప్ రాహుల్.. ప్రెజెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ట్రైలర్ పాజిటివ్ టాక్ తెచ్చిపెట్టింది. కానీ లాంగ్ రన్ సాధించి కలెక్షన్స్ రాబట్టాలంటే స్టాండప్ రాహుల్ కొచ్చే మాత్ టాక్ చాలా కీలకం. నెక్ట్స్ ఇలాంటి పరీక్షనే ఎదుర్కోబోతుంది తాప్సీ మిషన్ ఇంపాజిబుల్. ట్రిపుల్ ఆర్ రిలీజైన వారానికి ఏప్రిల్ 1న ఈ మూవీ థియేటర్స్ కి రాబోతుంది. ఈమధ్యే బయటికొచ్చిన ట్రైలర్ కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది.

Tollywood Star Hero’s: సీనియర్లే కానీ.. ఒక్కొక్కరు నాలుగైదు ప్రాజెక్టుల్లో రఫ్ఫాడించేస్తున్నారు!

ఏప్రిల్ 8న గని రాబోతుంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదాపడ్డ ఈ సినిమాను చిన్న సినిమా క్యాటగిరీలో వేయలేం. వరుణ్ తేజ్ కి మినిమం బడ్జెట్ హీరోగా పేరుంది. గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఉంది. ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించినా కనీసం రెండు వారాలు థియేటర్లో ఆడాలంటే బాక్సింగ్ గని కంటెంట్ బాగా చూపించాలి. ఎందుకంటే ఆ వెంటనే ఏప్రిల్ 14న కేజీఎఫ్2, బీస్ట్ లాంటి క్రేజీ సినిమాలు కాచుకూర్చున్నాయి.

Young Heroes: పడుతూ లేస్తున్న యంగ్ హీరోలు.. ఒక్క బ్లాక్ బస్టర్ ప్లీజ్!

ఏప్రిల్ 22న నాగశౌర్య కృష్ణా వృందా విహారీ, జయమ్మ పంచాయితీ, అశోక వనంలో అర్జున కల్యాణం లాంటి సినిమాలున్నాయి. ఒకే రోజు రిలీజవుతున్న ఈ మూడు చిన్న సినిమాలకు వారం ముందు కేజీఎఫ్2, బీస్ట్.. వారం తర్వాత ఆచార్య లాంటి సినిమాలతో థ్రెట్ ఉంటుంది. అంటే నాగశౌర్య, విశ్వక్ సేన్, సుమ పోటీ పడాలి. వారం రన్ లోనే పెట్టిన పెట్టుబడికి లాభాలు తెచ్చిపెట్టాలి.

Star Heroes : తారుమారవుతున్న హీరోల కథలు..

మే 12 సర్కారు వారి పాట తర్వాత మే 20న పక్కా కమర్షియల్ తో లక్ చెక్ చేసుకోబోతున్నాడు గోపీంచంద్. కొవిడ్ టైమ్ లో వచ్చిన సీటీమార్ పర్వాలేదనిపించినా.. గోపీకిప్పుడు సాలిడ్ హిట్ కావాలి. అందుకే మారుతి, రాశిఖన్నాలతో కలిసి పక్కా కమర్షియల్ అంటూ ఫన్ రైడ్ చూపించబోతున్నాడు.

Telugu Young Heroes: కంటెంట్ చాలు.. కటౌట్ అవసరం లేదంటున్న చిన్న హీరోలు!

మే 27న మూడు సినిమాల పోటీ ఉండబోతుంది. భారీ బడ్జెట్ కాదు కానీ ఈ లిస్ట్ లో వెంకీ, వరుణ్ ఎఫ్3 ఉంది. ఎఫ్2తో వచ్చిన క్రేజ్ ఎఫ్3కి యూజ్ అవుతుంది. ఆడియెన్స్ ను థియేటర్స్ కి తీసుకొచ్చేందుకు హెల్ప్ చేస్తుంది. సో ఎఫ్3 పాటే రిలీజయ్యే మేజర్, రంగ రంగ వైభవంగా సినిమాలు కాస్త జాగ్రత్తపడాలి.

Tollywood Heroes : రెండు పడవల మీద కాళ్లేయడం కాదు…రెండు చేతులా సంపాదించడం అంటున్న స్టార్స్..

జూన్ 10న నాని అంటే సుందరానికి థియేటర్స్ లోకి రాబోతుంది. ఆ తర్వాత జూలైలో సలార్, ఆగస్ట్ లో లైగర్ మధ్యలో రవితేజ రావణాసుర లాంటి సినిమాలున్నాయి. ఇంకా చాలా చిన్న సినిమాలు సరైన్ స్పేస్ కోసం సెర్చ్ చేస్తున్నాయి. అఖిల్, నితిన్, నిఖిల్ లాంటి హీరోలు వారం గ్యాప్.. పెద్ద సినిమాల పోరు లేకుండా ఫ్రీగా రావాలని చూస్తున్నారు. అందుకే కాస్త వెయిట్ చేసి కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ చెప్తామంటున్నారు.