Charge Sheet: డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్!

టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్‌లో సంచలన విషయాలను ప్రస్తావించింది.

Charge Sheet: డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్!

Drugs Case

Charge Sheet: టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఛార్జ్ షీట్‌లో సంచలన విషయాలను ప్రస్తావించింది. కెల్విన్‌పై ఛార్జ్ షీట్‌లో సినీ తారలను విచారించినట్లు ప్రస్తావించిన ఎక్సైజ్ శాఖ.. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. సినీ తారల డ్రగ్స్ కేసులో బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. సినీ తారలు, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, హోటల్ నిర్వాహకులకు డ్రగ్స్ అమ్మిననట్లు కెల్విన్ వాంగ్మూలంలో చెప్పినట్లు ఎక్సైజ్ శాఖ చెప్పింది.

సిట్ బృందం పలువురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించిందని, అన్ని రకాల సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి, విశ్లేషించిందని, సెలబ్రిటీలపై బలమైన ఆధారాలు లభించలేదని చెప్పింది ఎక్సైజ్ శాఖ. సెలబ్రిటీలపై కెల్విన్ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవని, సెలబ్రిటీలపై కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవపట్టించేదిలా ఉందని చెప్పింది.

కేవలం నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేమని, సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదని ఎక్సైజ్ శాఖ చెప్పింది. సెలబ్రిటీలు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ కూడా లభించలేదని, పూరి జగన్నాథ్, తరుణ్ స్వచ్ఛందంగా బయో శాంపిల్స్ కూడా ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ చెప్పింది.

పూరి జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఎఫ్ఎస్ఎల్ తేల్చినట్లు చెప్పింది. దాదాపుగా అందరు సెలబ్రిటీలకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ చెప్పింది. నిందితులు, సాక్షుల జాబితాలో సినీ తారల పేర్లు పొందుపరచని ఎక్సైజ్ శాఖ వారికి దాదాపుగా క్లీన్ చీట్ ఇచ్చేసింది.