హనీ ఈజ్ ది బెస్ట్ : ట్రెండింగ్ లో ఎఫ్ 2 డిలీటెడ్ సీన్

  • Published By: venkaiahnaidu ,Published On : March 8, 2019 / 03:39 AM IST
హనీ ఈజ్ ది బెస్ట్ : ట్రెండింగ్ లో ఎఫ్ 2 డిలీటెడ్ సీన్

విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో జనవరి-11,2019న విడుదలైన మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) బాక్సీఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలో 140 కోట్ల గ్రాస్ సాధించిన మొదటి మల్టీస్టారర్ మూవీగా ఎఫ్ 2 నిలిచింది. ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన డీలీటెడ్ వీడియోను నిర్మాత దిల్ రాజు యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2

ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ వీడియోలో వెంకీ,తమన్నా, మెహ్రీన్ ల మధ్య జరిగే సంభాషణ చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ సినిమాలో వెంకీ భార్యగా తమన్నా,వరుణ్ భార్యగా మెహ్రీన్ నటించిన విషయం తెలిసిందే. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.
Also Read : మళ్లీ బాలయ్యకు టికెట్