F3: 6 డేస్ కలెక్షన్స్.. హాఫ్ సెంచరీకి చేరువలో ‘ఎఫ్3’!

దర్శకుడు అనిల్ రావిపూడి గతంలో తెరకెక్కించిన ‘ఎఫ్2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్...

F3: 6 డేస్ కలెక్షన్స్.. హాఫ్ సెంచరీకి చేరువలో ‘ఎఫ్3’!

F3 Movie 6 Days Collections

F3: దర్శకుడు అనిల్ రావిపూడి గతంలో తెరకెక్కించిన ‘ఎఫ్2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి చేసిన కామెడీ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, అప్పుడే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. వారు చెప్పినట్లుగానే ‘ఎఫ్3’ సినిమాను సీక్వెల్ మూవీగా తెరకెక్కించి ఇటీవల రిలీజ్ కూడా చేశారు. ఈ సినిమాను కూడా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ మూవీగా దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన మార్క్ టేకింగ్ తో తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

F3 Movie : హిట్ సినిమాని బాగోలేదని ప్రచారం చేస్తున్నారు.. F3 సక్సెస్ మీట్‌లో సీరియస్ అయిన ఆలీ..

ఇక ఈ సినిమాను చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుండటంతో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి 6 రోజులు ముగియడంతో ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.46 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించి ఈ సినిమా తన సత్తా చాటుతోంది. మరోసారి వెంకటేష్, వరుణ్ తేజ్ ల కామెడీ ఈ సినిమాను ప్రేక్షకులకు బాగా నచ్చడంతో వారు ఈ సినిమాను తమ ఫ్యామిలీతో పాటు కలిసి చూస్తున్నారు. ఇక ఈ సినిమా 6 రోజుల థియేట్రికల్ రన్ ముగిసే సరికి ఏరియాల వారీగా కలెక్ట్ చేసిన షేర్ వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Rajendra Prasad : ఈ సినిమా హిట్ అవ్వకపోతే.. ఇక నేను మీకు కనపడను..

నైజాం – 15.94 కోట్లు
సీడెడ్ – 5.15 కోట్లు
ఉత్తరాంధ్ర – 4.92 కోట్లు
గుంటూరు – 2.70 కోట్లు
నెల్లూరు – 1.50 కోట్లు
ఈస్ట్ – 2.70 కోట్లు
వెస్ట్ – 2.01 కోట్లు
కృష్ణా – 2.25 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.37.30 కోట్లు
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 2.55 కోట్లు
ఓవర్సీస్ – 6.55 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ 6 డేస్ కలెక్షన్స్ – 46.40 కోట్లు