F3: ఎఫ్3 సెన్సార్ రిపోర్ట్.. సమ్మర్లో చిల్ కావడం ఖాయం!
టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా వస్తున్న ఎఫ్3 సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గతంలో వచ్చిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా....

F3: టాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా వస్తున్న ఎఫ్3 సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గతంలో వచ్చిన ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనుల, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఎఫ్3 మూవీ తాజాగా సెన్సార్ పనులు కూడా కంప్లీట్ చేసుకుని థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అయ్యింది.
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
ఇక ఎఫ్3 చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేయడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ఎఫ్3 వస్తుండటంతో ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్లో అలరించనుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. అయితే ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు, ఇటీవల కాలంలో ఈ రేంజ్ కామెడీ జోనర్ మూవీ రాలేదని.. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించడం ఖాయమని వారు చిత్ర యూనిట్‌ను అభినందించినట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది.
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
సెన్సార్ బోర్డు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా ఖచ్చితంగా ఈ వేసవిలో ఆడియెన్స్‌ను చిల్ చేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్2 చిత్రంలో నటించిన మెజారిటీ యాక్టర్స్ ఈ సినిమాలోనూ నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పీర్జాదా ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా, సొనాల్ చౌహాన్, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మే 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
#F3Movie certified clean ‘U’ 🫵🏻😉
A CLEAN ENTERTAINER to Chill with your Family Members! 🤩2 hrs 28 mins of FUN Ride 📽️
సినిమా మొత్తం నవ్వులే నవ్వులు! ✅😉#F3OnMay27@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official @adityamusic pic.twitter.com/X4TD7ycs9c— Sri Venkateswara Creations (@SVC_official) May 20, 2022
- Dil Raju : ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో దిల్ రాజు సమావేశం.. వేతనాలు కొలిక్కి వచ్చినట్టేనా??
- Salman Khan : టాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్న సల్మాన్..
- Varun Tej: మరో యంగ్ డైరెక్టర్‌కు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్..?
- Vijay66: అదిరిపోయే టైటిల్‌తో తిరిగొచ్చిన బాస్!
- Sai Pallavi: సాయి పల్లవికి నేషనల్ అవార్డ్ ఖాయం: వెంకటేష్
1Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
2Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
3Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
5Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
6Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
7TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
8Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
9Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
10Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ